నిర్మాత సాహు గారపాటికి ఇండస్ట్రీలో మంచి గుడ్ విల్ ఉంది కానీ సక్సెస్ పరంగా ఆయన బ్యానర్ లో వచ్చిన పెద్ద హిట్లు ఇప్పటిదాకా రెండే. ఒకటి మజిలీ, రెండు భగవంత్ కేసరి. 2018 కృష్ణార్జున యుద్ధంతో ప్రొడ్యూసర్ గా డెబ్యూ చేసిన ఈయనకు టక్ జగదీశ్, గాలి సంపత్, ఉగ్రం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. లైలా మరీ దారుణంగా దెబ్బ కొట్టింది. డిజాస్టర్లు అందరికీ సహజమే కానీ మరీ ఇంత నాసిరకం సినిమా తీస్తారా అంటూ షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద చిన్న మరక పడేలా చేసింది. మలయాళంలో తీసిన వ్యసనసమేతం బంధుమిత్రాదికల్ కు ప్రశంసలు వచ్చాయి కానీ ఆశించిన స్థాయిలో వసూళ్లు దక్కలేదు.
తాజాగా విడుదలైన కిష్కిందపురి కొంత ఊరట కలిగించిందనే చెప్పాలి. ఒకపక్క మిరాయ్ లాంటి ప్యాన్ ఇండియా మూవీతో పోటీ. ఇంకో వైపు దూకుడు తగ్గించకుండా లిటిల్ హార్ట్స్ ప్రమోషన్లతో దూసుకుపోతున్న వైనం, హారర్ జానర్ కాబట్టి అన్ని వర్గాలను తన సినిమా రీచ్ కాదేమోననే అనుమానం, వెరసి సాహు గారపాటిని ఒక రకమైన టెన్షన్ ఆవహించిందనేది పలు సందర్భాల్లో కనిపించింది. తమకు మాట వరసకైనా చెప్పకుండా మిరాయ్ డేట్ వేశారని హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో పాటు సాహు కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం ఇంటర్వ్యూలో చూశాం. ఇన్ని ప్రతికూలతలు తట్టుకుని సినిమా అయితే నిలబడింది.
రికార్డులు బద్దలు కొట్టే బ్లాక్ బస్టర్ కాదు కానీ ఇంత కాంపిటీషన్ లోనూ బ్రేక్ ఈవెన్ దాటి లాభాలు ఇవ్వడం కిష్కిందపురికి జరిగిన మంచి విషయం. నెక్స్ట్ సాహు గారపాటి నుంచి వస్తున్న సినిమా మన శంకరవరప్రసాద్ గారు. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఎంటర్ టైనర్ ఇప్పటిదాకా ఈ బ్యానర్ లోనే పెద్ద బడ్జెట్ తో రూపొందుతోంది. వందల కోట్లు పెట్టడం లేదు కానీ క్యాస్టింగ్, కాంబినేషన్, సెట్టింగ్ పరంగా చూసుకుంటే వ్యయం చిన్నదేమీ కాదు.అనిల్ రావిపూడితో రెండోసారి జట్టు కట్టిన సాహు గారపాటికి ఇది కనక పెద్ద హిట్ అయితే అయితే టాప్ లీగ్ లోకి వెళ్లిపోవచ్చనే నమ్మకంతో ఉన్నారు.
This post was last modified on September 19, 2025 12:05 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…