Movie News

సుజీత్… ఇదే శ్రద్ధ సినిమాపై పెట్టుంటే?

గత నెలలో ‘కూలీ’ సినిమాకు రిలీజ్ ముంగిట ఎంత హైప్ వచ్చిందో తెలిసిందే. తీరా చూస్తే అంచనాలకు దరిదాపుల్లో కూడా ఆ సినిమా నిలవలేకపోయింది. కింగ్డమ్, వార్-2 లాంటి భారీ చిత్రాలు కూడా ఎన్నో ఆశలు రేకెత్తించి నిరాశకే గురి చేశాయి. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘ఓజీ’ ఏం చేస్తుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పవన్ కెరీర్లోనే అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ఇదొకటి. 

రెండేళ్ల ముందు ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ వచ్చిందో లేదో.. ఒక్కసారిగా సినిమా హైప్ పీక్స్‌కు వెళ్లిపోయింది. ఇక అక్కడ్నుంచి ‘ఓజీ’ నుంచి ఏ ప్రోమో రిలీజ్ చేసినా.. స్టాండర్డ్ తగ్గట్లేదు. పోస్టర్లు.. పాటలు.. వీడియో ప్రోమోలు.. అన్నీ కూడా అభిమానులను అబ్బురపరుస్తున్నాయి. సామాన్య ప్రేక్షకుల్లో కూడా సినిమా పట్ల అంచనాలను పెంచుతున్నాయి. ‘ఓజీ’ని డైరెక్ట్ చేస్తున్న సుజీత్.. పవర్ స్టార్‌కు వీరాభిమాని అన్న సంగతి అందరికీ తెలుసు. ‘గబ్బర్ సింగ్’ రిలీజ్ టైంలో సగటు అభిమానిగా అతను ఎంత హడావుడి చేశాడో చెప్పడానికి ఇప్పటికీ యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి. 

హరీష్ శంకర్ లాగే ఒక సగటు అభిమానిలా ఆలోచిస్తూ.. తన ఫేవరెట్ హీరోను ది బెస్ట్‌గా చూపించడానికి అతను ఎంత తపిస్తున్నాడో ప్రోమోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ‘సాహో’ తర్వాత బాలీవుడ్‌లో అవకాశాలు వచ్చినా అటు చూడకుండా తన అభిమాన హీరోతో సినిమా కోసం ఇక్కడే ఉండిపోయాడు సుజీత్. ఇక ‘ఓజీ’ మధ్యలో ఆగి, మళ్లీ ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందో తెలియని స్థితిలో వేరే సినిమా చేసుకునే అవకాశం వచ్చినా అతను దృష్టిమళ్లించలేదు. తన శక్తిసామర్థ్యాలన్నింటినీ ‘ఓజీ’ కోసమే వెచ్చించాలని నిర్ణయించుకున్నాడు. షూటింగ్‌కు బ్రేక్ పడ్డాక మధ్యలో దొరికిన ఖాళీనంతా సినిమాకు మెరుగులు దిద్దడానికే ఉపయోగించాడు. ప్రోమోల విషయంలో అతనెంత శ్రద్ధ పెట్టాడన్నది అణువణువునా కనిపిస్తోంది. 

లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ‘గన్స్ అండ్ రోజెస్’ లిరికల్ వీడియో‌ను టాలీవుడ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద బెస్ట్‌గా చెప్పొచ్చు. అందులో ఒక్కో ఫ్రేమ్ గురించి ఒక పేరా రాయొచ్చు అనేలా ఎంతో స్ట్రైకింగ్‌గా ఉన్నాయి. యానిమేషన్ కంటెంట్‌తో అతనిచ్చిన డీటైలింగ్‌, తన అభిమాన కథానాయకుడికి ఇచ్చిన ఎలివేషన్ చూసి అభిమానులకు మతిపోయింది. ప్రోమోల మీద పెట్టిన శ్రద్ధనే సినిమా మీద కూడా పెట్టి ఉంటే ఔట్ పుట్ అదిరిపోతుందని.. పవన్ కెరీర్లోనే ‘ఓజీ’ చాలా స్పెషల్‌ మూవీగా నిలిచిపోవడం, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని చెప్పొచ్చు.

This post was last modified on September 17, 2025 2:49 pm

Share

Recent Posts

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

3 hours ago

విశ్వక్ సేన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో

ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…

5 hours ago

శ్రీవిష్ణు సినిమాకు అదొక్కటే సవాల్

ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…

5 hours ago

రాజుగారికి రాములోరి అభయం దక్కుతుందా

యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…

6 hours ago

అగ్గిపెట్టి మ‌చ్చా ఇక లేడు

అగ్గిపెట్టి మ‌చ్చా.. సోష‌ల్ మీడియా వాడే తెలుగు వాళ్ల‌కు ప్ర‌త్యేకంగా ఈ పేరును ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అత‌డి…

8 hours ago

ఇకపై మొహమాటలు లేవంటున్న నాని

న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…

8 hours ago