ప్రముఖ నటి సుమలత తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసిన ఒక పోస్ట్ అందరిని భావోద్వేగానికి గురి చేస్తోంది. తెలుగుతో పాటు పలు భాషల్లో నటించిన ఆమె.. తర్వాతి కాలంలో ప్రముఖ నటుడు అంబరీష్ ను పెళ్లాడటం.. ఈ మధ్యనే ఆయన మరణించటం తెలిసిందే. హ్యాపీ కఫుల్ గా పేరున్న వీరి బంధం ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చేది. అనారోగ్యానికి గురైన అంబరీష్ మరణం ఆమెను ఎంతలానో కుంగదీసింది. అదేమీ బయటకు కనిపించకుండా ఉండేలా.. ధైర్యంగా కనిపిస్తుంటారు.
ఆమె గుండెల్లోని భావోద్వేగాన్ని తాజాగా ఒక పోస్ట్ లో పంచుకున్నారు. ఆ పోస్టును చదివినంతనే కన్నీటి చెమ్మ కమ్మేయటమే కాదు.. వారిద్దరి అనుబంధం ఎంతటిదన్న దానిపై మరింత స్పష్టత రావటం ఖాయం. నవంబరు 24తో అంబరీష్ మరణించి రెండేళ్లు అవుతుంది. ఈ సందర్భంగా తన మనసులోని భావోద్వేగానని ఇన్ స్టా పోస్టులో పంచుకున్నారు.
‘‘కళ్లు మూసి ఉంచగలను. చెవులను కూడా మూయగలను. కానీ నా హృదయాన్ని మాత్రం మూయలేను. ఎందుకంటే ఒక అనంతమైన ప్రేమ.. ఒక అపూర్వమైన శక్తి.. ఎన్నో జ్ఞాపకాలు దాగి ఉన్న హృదయం అది. మీరు లేకుండా రెండేళ్లు గడిచాయి. మీతో గడిపిన ప్రతి క్షణం.. ఎంత విలువైనదో తలుచుకుంటుననాను. మనం పంచుకున్న ఆ తీయని క్షణాలు.. జ్ఞాపకాలు.. నవ్వులు.. ప్రేమ.. అన్నీ అపూర్వమైనవి. సవాళ్లు ఎదురైనప్పుడు నా చెయ్యి పట్టుకొని నడిపించిన క్షణాలు.. కలిగించిన ఆత్మవిశ్వాసం.. నింపిన ధైర్యం.. చీకటి క్షణాల్లో నింపిన నమ్మకం.. ప్రేమ.. వదిలి వెళ్లిన వారసత్వం.. ఇవన్నీ నా జీవితం మొత్తం నన్ను నడిపిస్తాయి. మీ మంచితనం తాలూకు వెలుగు జీవితంలో నాకెదురయ్యే కష్టాల నుంచి కాపాడుతుంది. నా చివరి శ్వాస వరకూ మీరు ఉంటారు. నా నవ్వు.. నా ఏడుపు అన్నింట్లోనూ ఉంటారు. నేను పడిపోయినా.. తడబడినా.. మీ అనంతమైన బలం నన్ను నిలబడేలా చేస్తుంది నాకు తెలుసు. ఇప్పుడు బతికి ఉన్నది నేను కాదు. నా ద్వారా బతికి ఉన్నది మీరే.. మళ్లీ మనం ఒక్కటయ్యే వరకూ నా హృదయాన్ని పదిలంగా పట్టుకునే ఉండండి.. నన్ను బలంగా ఉంచండి’’ అంటూ తనకున్న అపారమైన ప్రేమాభిమానాల్ని తాజా పోస్ట్ తో వెల్లడించారు.
This post was last modified on November 25, 2020 10:34 am
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పెద్దగా వివాదాల జోలికి వెళ్లే వ్యక్తి కాదు. కానీ కొన్ని రోజుల కిందట తాను…
ఒక భారీ పాన్ ఇండియా హిట్ కొట్టాక.. ఆ హీరో నటించే సినిమా జాతీయ స్థాయిలో ఎలా ఆడుతుందనే ఆసక్తి…
మన శరీరంలో కాలేయం ఎంతో ముఖ్యమైన భాగం. ఇది రక్తాన్ని శుభ్రపరచడమే కాకుండా, జీవక్రియను వేగవంతం చేయడం, ఆహారాన్ని జీర్ణం…
ఏపీలో కీలకమైన ఇంటర్మీడియెట్ తొలి సంవత్సరం పరీక్షలు రద్దు చేశారని, రెండేళ్లుకలిపి ఒకేసారి నిర్వహిస్తున్నారని పేర్కొం టూ.. బుధవారం మధ్యాహ్నం…
ఈ నెల 10 శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక సర్వదర్శన టోకెన్ల పంపిణీని…
ఏపీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ తన ప్రసంగంలో ఏకంగా 21 సార్లు నమో అనే పదాన్ని…