పవన్ కళ్యాణ్ ఓజికు ముందు వెనుకా ఎవరూ వచ్చే రిస్క్ చేయరని అనుకున్నారు కానీ సెప్టెంబర్ 19 వస్తున్న సినిమాలు లిస్టు కాసింత పెద్దదిగానే ఉంది. ఒకపక్క మిరాయ్ వీరవిహారం చేస్తోంది. రెండో వారంలోనూ దూకుడు కొనసాగించడం ఖాయం. చూడాల్సిన ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీకెండ్ టికెట్లు దొరకలేదు కాబట్టి నెక్స్ట్ వీక్ కి పోస్ట్ పోన్ చేసుకుంటారు. కిష్కిందపురి ఊహించిన దానికన్నా మెరుగ్గా పికప్ కావడం మంచి పరిణామం. లిటిల్ హార్ట్స్ సైతం నాకేం ఢోకా లేదనే రీతిలో బండి లాగేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం రాబోయే అయిదారు చిత్రాలు కంటెంట్ మీద నమ్మకంతో ఉన్నాయి.
రాజా సాబ్ దర్శకుడు మారుతీ నిర్మాణ భాగస్వామిగా రూపొందిన ‘బ్యూటీ’ సర్ప్రైజ్ ఇవ్వొచ్చనే నమ్మకం టీమ్ లో ఉంది. పవన్ స్ఫూర్తితో తీశామని చెబుతున్న యూనిట్ మాటలకు తగ్గట్టు మ్యాటర్ ఉంటే హిట్టు చూడొచ్చు. ఎన్ని ఫ్లాపులు వచ్చినా తెలుగు మార్కెట్ ని పట్టువదలని విక్రమార్కుడిలా పట్టుకున్న విజయ్ ఆంటోనీ ఈసారి ‘భద్రకాళి’ రూపంలో పొలిటికల్ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. మంచు లక్ష్మి, మోహన్ బాబు కలయికలో తెరకెక్కించిన ‘దక్ష’కు హైప్ పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కెజిఎఫ్ సలార్ సంగీత దర్శకుడు మెగాఫోన్ చేపట్టి డైరెక్ట్ చేసిన కన్నడ డబ్బింగ్ ‘వీరచంద్రహాస’ చాలా ఆలస్యంగా తెలుగులోకి తెస్తున్నారు.
ఇవి కాకుండా వెంకటేష్ క్లాసిక్ స్వర్ణకమలం స్ఫూర్తితో తీశామని చెబుతున్న ‘అందెల రవమిది’ అదే రోజు రానుంది. ఇవి కాకుండా ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసుండరు, కర్మణ్యే వాదీకారస్తేలు బరిలో దిగుతున్నాయి. బాలీవుడ్ మూవీ ‘జాలీ ఎల్ఎల్బి 3’ వస్తోంది. ఆడియన్స్ కోణంలో చూసుకుంటే ఆప్షన్లు బోలెడు ఉన్నాయి కానీ జనాలు అప్పుడే ఓజి మూడ్ లోకి వెళ్లిపోతున్నారు. బజ్ భారీగా ఉండటంతో సాధారణ ప్రేక్షకుల్లో సైతం యాంగ్జైటీ కనిపిస్తోంది. మరి పవన్ సునామికి ముందు రిలీజవుతున్న ఈ సినిమాల్లో ఏవి విజేతగా నిలుస్తాయో ఏవి పోరాడతాయో ఇంకో మూడు రోజుల్లో తేలనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates