ఇంకా ప్రభుత్వాల నుంచి జీవోలు రాలేదు. నిర్మాతలు ఎంతమేరకు పెంపు అడుగుతూ అప్లికేషన్లు పెట్టారో క్లారిటీ లేదు. అయినా సరే అప్పుడే డిస్ట్రిబ్యూషన్ వర్గాలు, అభిమానుల సంఘాల మధ్య దీని గురించి చర్చలు మొదలైపోయాయి. సెప్టెంబర్ 24 రాత్రి తొమ్మిది నుంచి పది గంటల మధ్య వేసే స్పెషల్ ప్రీమియర్లకు వెయ్యి రూపాయలను ఫ్లాట్ టికెట్ రేట్ గా పెట్టాలని చూస్తున్నట్టుగా వచ్చిన వార్త హాట్ టాపిక్ గా మారింది. దాని తర్వాత అర్ధరాత్రి ఒంటి గంట వేసే షోకు అయిదు వందలు, ఆపై రెగ్యులర్ ఆటలకు కనీసం వంద నుంచి నూటా యాభై దాకా పెంపుతో కనీసం పది రోజులైనా పర్మిషన్లు తీసుకుంటారని ట్రేడ్ టాక్.
బయట ఓజి మేనియా చూస్తుంటే అభిమానులు వెయ్యి అంటే డోంట్ కేర్ అనేలా ఉన్నారు. ఎందుకంటే ట్విట్టర్ స్పేస్ లో ఫస్ట్ టికెట్ సేల్ పెడితే ఒక ఫ్యాన్ లక్ష రూపాయలకు పాడుకోవడం దీనికున్న క్రేజ్ కున్న నిదర్శనం. ఓవర్సీస్ లో అయిదు లక్షలు ఇచ్చేందుకు ఒక ఎన్ఆర్ఐ రెడీ అయ్యాడు. ఈ డబ్బులు వెళ్ళేది జనసేన నిధికే అయినా వాళ్ళు ఓజినే దానికి ఎంచుకోవడం హైప్ ఏ స్థాయిలో ఉందో తేటతెల్లం చేస్తోంది. ఆఫ్ ది రికార్డు పంపిణీదారులు చెబుతున్న మాట ఒకటే. ముందు రోజు రాత్రి షో వెయ్యి పెట్టినా సరే హౌస్ ఫుల్స్ పడటం ఖాయమని అంటున్నారు. చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వీటికి సంబంధించిన పూర్తి క్లారిటీ ఇంకో నాలుగైదు రోజుల్లో రావొచ్చు. విడుదలకు కేవలం తొమ్మిది రోజులు మాత్రమే ఉంది. ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్లానింగ్ జరుగుతోంది. ఇవి కాకుండా పవన్ కళ్యాణ్ అదే పనిగా బయటికి వచ్చి చేసే ప్రమోషన్లు ఉండకపోవచ్చు. కొన్ని ప్రత్యేక ప్రోమోలను టీమ్ ఆల్రెడీ షూట్ చేసి పెట్టుకుంది. ప్రస్తుతానికి టీమ్ సైలెంట్ గా ఉన్నట్టు కనిపిస్తున్నా అండర్ కరెంట్ లా ఓజి మేనియా జనాల్లో మాములుగా లేదు. అయినా హరిహర వీరమల్లుకే రేట్లు లెక్క చేయని అభిమానులు ఇప్పుడు ఓజికి మాత్రం క్యాలికులేటెడ్ గా ఉంటారా. ఏమో చూడాలి మరి.
This post was last modified on September 15, 2025 6:25 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…