Movie News

ఆ సినిమా నష్టం 200 కోట్లు, అమీర్ షాకింగ్ వ్యాఖ్యలు

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఇప్పుడప్పుడే లాల్ సింగ్ చద్దా గాయాలను మర్చిపోయేలా లేడు. సితారే జమీన్ పర్ తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుని ఓటిటిలో కాకుండా యూట్యూబ్ లో స్ట్రీమింగ్ చేయడం ద్వారా కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన ఈ వర్సటైల్ హీరో తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. అక్కినేని నాగచైతన్యకు హిందీ డెబ్యూగా దీని మీద తెలుగులోనూ మంచి అంచనాలు ఉండేవి. చిరంజీవి లాంటి ప్రముఖులకు ప్రీమియర్ వేసి మరీ పబ్లిసిటీ చేసుకున్నారు. ఇంతా చేసి కనీస వసూళ్లు రాకపోగా అమీర్ ఖాన్ నటన కూడా విమర్శలు చవి చూడాల్సి వచ్చింది.

అమీర్ చెప్పిన ప్రకారం జరిగిన కథ ఇది. దంగల్ కు ఇండియాలోనే 385 కోట్లు వచ్చాయి. అంత మొత్తం కాకపోయినా లాల్ సింగ్ చద్దా కనీసం వంద నుంచి రెండు వందల కోట్ల దాకా చేయొచ్చని అమీర్ అంచనా వేశారు. కానీ ఫుల్ రన్ పూర్తయ్యేలోగా 200 కోట్ల నష్టం మిగలడం అమీర్ ని షాక్ కి గురి చేసింది. షూటింగ్ మధ్యలో కరోనా వచ్చింది. దీంతో కీలక షెడ్యూల్స్ కోసం విదేశాలకు వెళ్లారు. యూనిట్ సభ్యుల ప్రయాణాలకే ఎక్కువ ఖర్చయ్యింది. టేబుల్ టెన్నిస్ మీద తీసిన ఒక ఖరీదయిన ఎపిసోడ్ కు కోట్లు కుమ్మరించారు. అదేమో ఎడిటింగ్ టేబుల్ దగ్గర తీసేయాల్సి వచ్చింది. ఇదంతా బూడిదలో పోసిన పన్నీరే.

ఇలా ప్రొడక్షన్ లోనే దెబ్బ మీద దెబ్బ తిన్న అమీర్ ఖాన్ తీరా థియేటర్ రిలీజ్ అయ్యాక మొదటి షోకే చేతులు ఎత్తేయడం ఫ్యాన్స్ సైతం ఊహించలేదు. ఓవర్సీస్ లోనూ డిజాస్టర్ కావడం మరో చేదు జ్ఞాపకం. లాల్ సింగ్ చద్దా ఆడితే జపాన్, చైనా తదితర దేశాల్లో రిలీజ్ చేయడం ద్వారా మొత్తం రికవర్ చేయొచ్చని అమీర్ భావించారు. కానీ జరిగింది వేరు. ఇంకా నయం, సితారే జమీన్ పర్ హిట్టయ్యింది కాబట్టి సరిపోయింది లేదంటే అమీర్ పరిస్థితి ఇంకా దీనంగా మారిపోయేదేమో. ఒకపక్క కొడుకు సెటిల్ కావడం లేదు. చేసిన సినిమాలన్నీ ఓటిటిలో కూడా దారుణంగా డిజాస్టరయ్యాయి. ఎప్పటికి బ్రేక్ దొరికేనో.

This post was last modified on September 15, 2025 9:58 am

Share

Recent Posts

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

41 minutes ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

4 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

5 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

6 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

12 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

14 hours ago