రోజులో ఎన్ని షోలయినా వేసుకోవచ్చని, అలాగే టికెట్ ధర ఆయా సినిమా డిమాండ్‍కి తగ్గట్టుగా ఎంతయినా పెట్టుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేసింది. త్వరలోనే ఏపీ గవర్నమెంట్ కూడా ఇదే ఉత్తర్వులు ఇస్తుందని తెలుగు చిత్ర పరిశ్రమ ఆశిస్తోంది. అయితే ఈ పెరిగిన టికెట్ రేట్లు చిన్న సినిమాలకు, మీడియం రేంజ్ సినిమాలకు ఏమంత ఉపయోగపడవు. అలాంటి చిత్రాలకు రేట్లు పెంచి అమ్మితే వచ్చే ప్రేక్షకులను స్వయంగా వెనక్కు పంపేసినట్టు అవుతుంది. ఈ పక్రియలో ముందుగా లాభపడే పెద్ద సినిమా వకీల్ సాబ్ అవుతుంది. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలని దిల్ రాజు చూస్తున్నాడు.
సంవత్సరం తర్వాత రిలీజ్ అయ్యే పెద్ద సినిమా కావడం, అది కూడా పవన్ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత తెరపై కనిపించే సినిమా కావడంతో వకీల్ సాబ్‍కు ఓపెనింగ్స్ పరంగా ఢోకా వుండదు. ఇప్పుడు రేట్లు కూడా బాగా పెంచుకోవచ్చు కాబట్టి ఇది దిల్ రాజుకి శుభవార్త. ఈ చిత్రానికి బడ్జెట్ కరోనా బ్రేక్‍కి ముందు వేసుకోగా, ఇప్పటి పరిస్థితుల్లో అది వర్కవుట్ అవడం లేదని దిల్ రాజు మల్లగుల్లాలు పడుతున్నాడు. ఈ టైమ్‍లో ఈ వార్త రావడంతో దిల్ రాజు మరోసారి లక్కీ రాజు అనిపించుకున్నాడు. వి సినిమాను లాక్‍డౌన్‍లో అమెజాన్ ద్వారా విడుదల చేసేసి దిల్ రాజు లాభపడిన సంగతి తెలిసిందే. అంత పెద్ద సినిమాను ఓటిటిలో విడుదల చేయడమేంటని అన్నవాళ్లే తెలివైన పని చేసాడని తర్వాత మెచ్చుకున్నారు.
This post was last modified on November 24, 2020 1:47 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…