దుబాయ్ సైమా అవార్డుల వేడుకలో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా దర్శకుడు సుకుమార్ పుష్ప 3 ది ర్యాంపేజ్ ఉంటుందని చెప్పడం ఒక్కసారిగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని యాక్టివేట్ చేసింది. వినడానికి సూపర్ ఎగ్జైటింగ్ గా ఉంది కానీ నిజంగా సాధ్యమా అనే కోణంలో విశ్లేషించుకుంటే అంత సులభంగా సమాధానం దొరకదు. ఎందుకంటే అట్లీ సినిమా షూట్ పూర్తయి విడుదలయ్యేనాటికి 2027 వచ్చేస్తుంది. ఒకవేళ ఇది కనక రెండు భాగాలైతే ఇంకో ఏడాది లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టొచ్చు. అప్పటికంతా సుకుమార్ హీరో రామ్ చరణ్ తో ఫిక్స్ చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీని పూర్తి చేయొచ్చు.
ఒకవేళ నిజంగా పుష్ప 3 ఫిక్స్ చేసుకుంటే బన్నీ మరోసారి చాలా కాలం త్యాగం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ముందు హెయిర్ స్టైల్ పెంచాలి. ఆ బాడీ మ్యానరిజంకు తగ్గట్టు మళ్ళీ ఒంటిని కష్టపెట్టాలి. కానీ పుష్ప 1, పుష్ప 2 కోసం అయిదేళ్ళు ఆల్రెడీ ఖర్చు పెట్టేసిన బన్నీ మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తాడా అనే అనుమానాలు ఇండస్ట్రీ వర్గాల్లో లేకపోలేదు. కేవలం పుష్ప బ్రాండ్ తోనే మార్కెట్ కాకుండా కొత్త సినిమాలతో నార్త్ ఆడియన్స్ కి దగ్గరవ్వాలని అల్లు అర్జున్ ప్లాన్. దానికి తగ్గట్టే బాలీవుడ్ దర్శకులతో అప్పుడప్పుడు టచ్ లో ఉన్నాడట. కానీ ఇప్పుడప్పుడే ఎలాంటి ప్రకటనలు వచ్చే ఛాన్స్ లేదు.
పుష్ప 3 ర్యాంపేజ్ కార్యరూపం దాలిస్తే ఫ్యాన్స్ కు పండగే. కాకపోతే ఇప్పటిదాకా టాలీవుడ్ లో మూడో భాగం వచ్చిన ప్యాన్ ఇండియా మూవీ పెద్దగా లేవు. అప్పుడెప్పుడో దశాబ్దాల క్రితం రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా మనీ, మనీ, మనీ మనీ మొర్ మనీ అనే సిరీస్ వచ్చింది కానీ మొదటిది తప్ప మిగిలినవి ఫెయిలయ్యాయి. పుష్పకు అంత రిస్క్ లేకపోయినా థర్డ్ పార్ట్ జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. ఇక సుకుమార్ సంగతి తెలిసిందే. పర్ఫెక్షన్ కోసం ఏళ్ళకేళ్ళు ఒకే ప్రాజెక్టు మీద ఉండిపోతారు. రామ్ చరణ్ 17 అయ్యేక ఏ హీరోతో లాక్ కాని సుకుమార్ అన్నమాట ప్రకారం పుష్ప 3ని తెరకెక్కిస్తే ఇంకో హిస్టరీ రెడీ అవుతుంది.
This post was last modified on September 6, 2025 1:28 pm
మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…
సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…
రీఎంట్రీ తర్వాత వరుసగా మూడు రీమేక్లతో పలకరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలో రెండు…