Movie News

భగత్ సింగ్ వేగం బాగుందయ్యా

ఎప్పుడు ఏ సమయంలో పవన్ కళ్యాణ్ బిజీ అవుతారో తెలియదు కాబట్టి తనకిచ్చిన బంగారం లాంటి డేట్లను వృథా చేయకుండా దర్శకుడు హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ని పరుగులు పెట్టిస్తున్నారు. ఈ ఏడాది విడుదల లేకపోయినా పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం కేటాయించి ప్రమోషన్ల కోసం ప్రత్యేక ప్లానింగ్ లో ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. ఇటీవలే ఒక పాట షూట్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. మొన్న పవన్ పుట్టినరోజుకి విడుదల చేసింది దాని స్టిల్లే. నిజానికి స్టెప్పుతో కూడిన చిన్న వీడియోని వదలాలనే ఆలోచన వచ్చిందట గాని ఓజి ఫీవర్ లో ఉన్న ఫ్యాన్స్ ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక పోస్టర్ తో సరిపెట్టారు.

ఇప్పుడు మరో సాంగ్ కోసం రంగం సిద్ధమైపోయింది. దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో శనివారం నుంచి దీని షూట్ మొదలుపెట్టబోతున్నట్టు సమాచారం. ఇందులో కూడా క్రేజీ నృత్య భంగిమలు ఉంటాయని తెలిసింది. హరీష్ శంకర్ ముందు పలు సవాళ్లున్నాయి. తేరి రీమేకనే ప్రచారం ఉస్తాద్ భగత్ సింగ్ హైప్ మీద తీవ్ర ప్రభావం చూపించింది. ఇప్పుడిది ఒరిజినల్ కథని ఆయన చెబుతున్నారు కానీ తెరమీద చూశాక తప్ప అభిమానులు నమ్మలేని పరిస్థితి. ఇదలా ఉంచితే హైప్ లో పీక్స్ ని చూసిన ఓజి తర్వాత వస్తున్న సినిమాని హరీష్ శంకర్ డైరెక్ట్ చేశారు. సో ఆ హిట్టుని హీటుని అదే రీతిలో కొనసాగించాలి.

అందుకే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా స్క్రిప్ట్ లో పలు మార్పులు చేసుకున్న హరీష్ శంకర్ మీద గబ్బర్ సింగ్ రేంజ్ విజయం ఇవ్వాల్సిన అతి పెద్ద బాధ్యత నెత్తి మీద ఉంది. ఇవి కాకుండా మిస్టర్ బచ్చన్ చేసిన గాయం పెద్దదే. రవితేజకో మర్చిపోలేని హిట్టు పడుతుందనుకుంటే పెద్ద డిజాస్టర్ దక్కింది. ఇప్పుడది పూర్తిగా సమిసిపోయేలా సక్సెస్ సాధించాలి. ఉస్తాద్ భగత్ సింగ్ అయ్యాక హరీష్ శంకర్ లిస్టులో సల్మాన్ ఖాన్, రామ్ లాంటి క్రేజీ స్టార్లు ఉన్నారు. వాళ్లలో ఎవరిని ఒప్పిస్తారో ఇంకా తేలలేదు. పవన్ మూవీ కనక పెద్ద హిట్టయితే ఆటోమేటిక్ గా పెద్ద కాంబోనే సెట్ అవుతుంది. అందులో సందేహం లేదు.

This post was last modified on September 5, 2025 7:48 am

Share

Recent Posts

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

52 minutes ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

59 minutes ago

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

2 hours ago

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

5 hours ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

6 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

7 hours ago