ప్రభాస్ ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న స్పిరిట్ ఇంకా సెట్స్ లోకి వెళ్ళలేదు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సిద్ధంగానే ఉన్నాడు కానీ డార్లింగ్ డేట్స్ కోసం వెయిటింగ్ గేమ్ కొనసాగుతూనే ఉంది. ఫెడరేషన్ సమ్మె వల్ల రెండు వారాలకు పైగా విలువైన డేట్లు వృథా కావడంతో ది రాజా సాబ్, ఫౌజీ కోసం ప్రభాస్ మళ్ళీ కాల్ షీట్లు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా దర్శకుడు మారుతీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకున్నాడు. జనవరికి వాయిదా పడటం వల్ల రాజా సాబ్ బృందానికి అదనంగా ఇంకో నెల రోజులు దొరకడం మహా అదృష్టంగా ఫీలవుతున్నారు.
ఇక స్పిరిట్ విషయానికి వస్తే ప్రభాస్ లుక్స్ తాను కోరుకున్న విధంగా వచ్చేలా చేసుకునేందుకు సందీప్ వంగా అన్ని ఏర్పాట్లలో ఉన్నాడట. ముఖ్యంగా కొంచెం బరువు తగ్గమని అతను చేసిన సూచనలకు అనుగుణంగానే ప్రభాస్ డైట్ ఫాలో అవుతన్నాడని, కరుడు గట్టిన పోలీస్ ఆఫీసర్ గా కనిపించేందుకు ఏం చేయాలో అంతా చేస్తున్నాడని ఇన్ సైడ్ టాక్. విశ్వసనీయ సమాచారం మేరకు డిసెంబర్ కన్నా ముందే చిత్రీకరణకు వెళ్లేలా ప్లానింగ్ జరుగుతోందని వినికిడి. ఎంతలేదన్నా స్పిరిట్ కోసం ఏడాది సంపూర్ణ సమయాన్ని సందీప్ వంగా అడుగుతున్నాడట. ప్రభాస్ సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది.
స్పిరిట్ టైం ఫ్రేమ్ ని బట్టే కల్కి 2, సలార్ 2 శౌర్యంగపర్వంలు ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు కానీ ఎటొచ్చి ఎప్పుడు స్టార్ట్ చేయాలనే క్లారిటీ మిస్ అవుతోంది. ప్రశాంత్ నీల్ వచ్చే ఏడాది ఏప్రిల్ దాకా ఫ్రీ అయ్యేదాకా లేడు. నాగ్ అశ్విన్ తరచు ఇంటర్వ్యూలలో దర్శనమిస్తున్నారు కానీ కల్కి 2 కబురు వస్తే చాలు సైలెంట్ అవుతున్నారు. మరి స్పిరిట్ కబురు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారో ప్రస్తుతానికి సస్పెన్స్. సందీప్ సన్నిహితుల మాటలను బట్టి చూస్తే 2027 డిసెంబర్ ని టార్గెట్ చేసుకున్నారట. నిజమైతే మాత్రం రెండేళ్ల వెయిటింగ్ తప్పదు.
This post was last modified on September 5, 2025 7:48 am
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…