సెప్టెంబర్ 5 విడుదల కాబోతున్న లిటిల్ హార్ట్స్ సినిమాకు ఎలాంటి స్టార్ బ్యాకప్ లేదు. సోషల్ మీడియాలో పాపులారిటీ ఉన్న మౌళిని హీరోగా పెట్టి తీశారు. బన్నీ వాస్, వంశీ నందిపాటిల అండ ఉండటంతో డిస్ట్రిబ్యూషన్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీ రిలీజ్ దక్కుతోంది. అయితే పోటీలో అనుష్క ఘాటీ ఉండటం కొంచెం టెన్షన్ పెట్టే విషయమే. పైగా శివ కార్తికేయన్ మదరాసి కూడా రేస్ లో ఉంది. సో ఈ కాంపిటీషన్ ని తట్టుకోవడం లిటిల్ హార్ట్స్ కి అంత సులభం కాదు. అందుకే యువతని టార్గెట్ చేసుకుని రేపు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, కాకినాడలో సాయంత్రం కాలేజీ స్టూడెంట్స్ కి ఫ్రీ షోలు వేస్తున్నారు.
వినేందుకు ఇది లిటిల్ ప్లాన్ లా కనిపిస్తోంది టాక్ బాగా వస్తే రిజల్ట్ చాలా బిగ్ గా ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రచారం చేయడంలో యూత్ పాత్ర చాలా కీలకం. లిటిల్ హార్ట్స్ వాళ్లకు నచ్చిందంటే రివ్యూలు వాళ్ళే పెట్టేసి ఉచితంగా ప్రచారం చేసి చూపిస్తారు. రిలీజ్ కు రెండు రోజుల ముందు చేయడం వల్ల ఎక్కువ సమయం దొరికి ఓపెనింగ్స్ కి ఉపయోగపడతాయి. నిజానిది ఈటివి విన్ కోసం తీసిన మూవీ. అయితే ఫైనల్ అవుట్ ఫుట్ చూసుకున్నాక థియేటర్లలో జనం బాగా ఎంజాయ్ చేస్తారని భావించి నిర్ణయం మార్చుకుని బిగ్ స్క్రీన్ కు తీసుకొస్తున్నారు. అందుకే ఇంత మార్కెటింగ్ అవసరమయ్యింది.
గతంలో ఈటీవీ విన్ సుమంత్ తో తీసిన అనగనగా పెద్ద హిట్టయ్యింది. నేరుగా థియేటర్లలో రిలీజ్ చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తర్వాత కొన్ని షోలు వేశారు కానీ ఓటిటిలో దొరికేది మళ్ళీ హాలుకు వచ్చి చూడటం ఎందుకని జనం లైట్ తీసుకున్నారు. లిటిల్ హార్ట్స్ కి ఆ పొరపాటు జరగకుండా జాగ్రత్త పడ్డారు. నిజానికి సెప్టెంబర్ 12 అనుకున్న డేట్ ని మిరాయ్ తో తలపడటం వద్దనుకుని వారం ముందుకు జరుపుకున్నారు. ఇక్కడ అనుష్క ఉన్నప్పటికీ టార్గెట్ ఆడియన్స్ వేరు కావడంతో ఖచ్చితంగా వర్కౌట్ చేసుకోచ్చనే కాన్ఫిడెన్స్ తో దిగుతున్నారు. 90స్ దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ లిటిల్ హార్ట్స్ మెయిన్ ప్రొడ్యూసర్.
Gulte Telugu Telugu Political and Movie News Updates