సుమ కొడుక్కి సరైన కాంబో దొరికింది

యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల సంతానం రోషన్ కనకాల డెబ్యూ మూవీ బబుల్ గమ్ డిజాస్టర్ కావడంతో కుర్రాడు బాగానే గ్యాప్ తీసుకున్నాడు. త్వరలో మోగ్లీగా రాబోతున్నాడు. రామ్ చరణ్ తో టీజర్ లాంచ్ చేయించి జనాల దృష్టిలో పడేలా చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం కావడంతో బడ్జెట్ భారీగా పెట్టిన వైనం కనిపించింది. రెండు నిమిషాల వీడియోలో కథేంటో చెప్పేశారు. అడవిలో ఉండే కుర్రాడు డబ్బున్న అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె మీద ఒక పోలీస్ ఆఫీసర్ కన్ను పడుతుంది. దీంతో ఆ అబ్బాయి మీద దాడులు మొదలవుతాయి. అయితే మోగ్లీ అంత ఆషామాషీగా లోంగే రకం కాదు .

మోగ్లీ అసలు ఆకర్షణ దర్శకుడు సందీప్ రాజ్. కలర్ ఫోటో లాంటి జాతీయ అవార్డు సాధించిన సినిమా ఇచ్చాక చాలా విరామం తీసుకున్నాడు. మధ్యలో కథలు ఇవ్వడం, నటించడం చేశాడు కానీ డైరెక్షన్ కు మాత్రం ఎక్కువ టైం పట్టింది అయితే మోగ్లీ చాలా స్పెషల్ గా ఉంటాడని, బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తానని హామీ ఇస్తున్నాడు. విజువల్స్ గట్రా చూస్తుంటే కంటెంట్ ఫ్రెష్ గా అనిపిస్తోంది. లైన్ పరంగా మరీ కొత్తదనం అనిపించకపోయినా నగరానికి నట్టడివికి ఎలా ముడిపెట్టారనే పాయింట్ మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకోవచ్చు. పరాక్రమం దర్శకుడు బండి సరోజ్ ఇందులో విలన్ గా నటించడం విశేషం.

రోషన్ కు మోగ్లీ హిట్టు కావడం చాలా అవసరం. ఎందుకంటే దీంతో ప్రూవ్ చేసుకుంటే కెరీర్ కు బలమైన నాంది పడుతుంది. సుమ, రాజీవ్ కనకాల ఎంత సెలబ్రిటీలు అయినా వాళ్లకు థియేటర్ ఆడియన్స్ వచ్చేంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. ఏదైనా సరే రోషన్ స్వంతంగా సంపాదించుకోవాల్సిందే. కుర్రాడిలో టాలెంట్ ఉంది కాబట్టి దాన్ని వాడుకునే దర్శకుడు దొరకాలి. కలర్ ఫోటోతో సుహాస్ కు చాలా పెద్ద బ్రేక్ దొరికింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అదే దర్శకుడు తీస్తున్న మోగ్లీ కనక సక్సెస్ అయితే తనలాగే రోషన్ కనకాల మంచి ఇన్నింగ్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు.