Movie News

తమ్ముడి సినిమాకు విజయ్ రివ్యూ

తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమాల్లోకి రావడం ఇష్టమే లేదన్నట్లుగా మాట్లాడాడు విజయ్ దేవరకొండ ఒకప్పుడు. ఆనంద్ తొలి చిత్రం ‘దొరసాని’ లాంచ్ అయినపుడు.. ఫస్ట్ లుక్ రిలీజైనపుడు.. టీజర్ వచ్చినపుడు అతను పట్టించుకోనట్లే ఉన్నాడు. దీంతో తమ్ముడి మీద ఏమైనా కోపంగా ఉన్నాడా అనుకున్నారు అందరూ. కానీ ‘దొరసాని’ రిలీజ్ ముంగిట విజయ్ సోదర ప్రేమ బయటికి వచ్చింది. ఆ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చి తమ్ముడిని, తమ్ముడి డెబ్యూ మూవీని తెగ పొగిడేశాడు. ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పాడు. కానీ అతడి అంచనాలు తిరగబడ్డాయి. సినిమా ఆడలేదు. పైగా ఆనంద్ విమర్శల పాలయ్యాడు. ఐతేనేం ఆనంద్ కెరీర్ ఏమీ స్లో అయిపోలేదు. అవకాశాలు ఆగిపోలేదు. మూడు సినిమాలు చేతికొచ్చాయి. అందులో ఒకటి పూర్తయి విడుదలైంది. మంచి స్పందన కూడా తెచ్చుకుంటోంది. ఆ చిత్రమే.. మిడిల్ క్లాస్ మెలోడీస్.

ఈ నెల 20న అమేజాన్ ప్రైమ్‌లో విడుదలైన ‘మిడిల్ క్లాస్ మెలొడోస్’కు కొంచెం లేటుగా రివ్యూ ఇచ్చాడు విజయ్. కాస్ట్ అండ్ క్రూ అందరి మీదా అతను ప్రశంసలు కురిపించేశాడు. దర్శకుడు వినోద్ అనంతోజు సహా టెక్నీషియన్లందరూ అద్భుత పనితనం చూపారంటూ వారిని ప్రశంసించిన విజయ్.. ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొండలరావు పాత్రలో అదరగొట్టిన గోపరాజు రమణకు వెంటనే ఏదైనా అవార్డు ఇవ్వాలన్న విజయ్.. హీరో ఫ్రెండు పాత్రలో మెరిసిన చైతన్యకు ఛాన్సులు ఇవ్వాలని కోరాడు. హీరో ఫ్రెండు లవర్ పాత్రలో ఆకట్టుకున్న దివ్య చేసే ప్రతి సినిమాలోనూ ఆకట్టుకుంటోందని అన్నాడు.

తన ఫ్రెండు తరుణ్ భాస్కర్ ఏదైనా చేసేయగలడని.. తాము అతడికి రుణ పడి ఉంటామని చెప్పాడు. వర్ష బొల్లమ్మ పెర్ఫామెన్స్ సూపర్ అన్న విజయ్.. చివరగా తమ్ముడు ఆనంద్ గురించి మాట్లాడాడు. అతణ్ని చూస్తే తనకు గర్వంగా ఉందని, అతను ఎంచుకుంటున్న సినిమాలు కూడా గర్వపడేలా ఉంటున్నాయని అన్నాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన దారి వేసుకుని అందులో సాగుతున్న ఆనంద్ నుంచి మరిన్ని మంచి సినిమాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. చివరగా సినిమాలో హీరో తండ్రి చెప్పే.. ‘‘కష్టపడు.. ఏదైనా అవసరం అయితే కాల్ చెయ్యి’’ అనే డైలాగ్‌తో తమ్ముడికి ఒక మెసేజ్ ఇచ్చి ముగించాడు విజయ్.

This post was last modified on November 23, 2020 8:07 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

5 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

6 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

6 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

7 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

7 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

7 hours ago