ఒకప్పుడు వసూళ్ల పరంగా రికార్డులు నెలకొల్పుతూ.. ఇండస్ట్రీ హిట్లు కొడుతూ టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడిగా ఉండేవాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఖుషి, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి చిత్రాలు సాధించిన వసూళ్లు చూసి ఆయా సందర్భాల్లో అందరూ ఆశ్చర్యపోయారు. బాహుబలి కంటే ముందు ఇండస్ట్రీ రికార్డ్ పవన్ పేరిటే ఉంది. ఐతే రాజకీయాల్లో బిజీ అయ్యాక పవన్‌కు సినిమాల మీద ఫోకస్ తగ్గిపోయింది. సరైన కాంబినేషన్లు కుదరలేదు. ఎక్కువగా రీమేక్‌లు చేశాడు.
దీంతో ఆయన సినిమాల బిజినెస్, వసూళ్ల స్థాయి పడిపోయింది. అదే సమయంలో వేరే స్టార్లు ముందుకు దూసుకెళ్లిపోయారు. వంద కోట్ల షేర్ అన్నది చాలామందికి కేక్ వాక్ అయిపోయింది. కానీ పవన్ మాత్రం ఇంకా ఆ ఘనతను అందుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. గత దశాబ్ద కాలంలో ఆయన చేసిన స్ట్రెయిట్ మూవీస్ అజ్ఞాతవాసి, హరిహర వీరమల్లు డిజాస్టర్లు కాగా.. రీమేక్ మూవీస్ ఒక స్థాయికి మించి ఆడలేకపోయాయి. దీంతో వంద కోట్ల షేర్ అన్నది పవన్‌కు ఇప్పటికీ కలగానే ఉంది. కానీ ఈ కలెక్షన్ల రికార్డులు ఎప్పుడూ ఆయన దృష్టిలో ఉండలేదు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్టీని నడపడానికి మాత్రమే సినిమాలు చేస్తున్నానని ఆయన చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
ఐతే పవన్ కొత్త సినిమా ‘ఓజీ’కి ఉన్న అనూహ్యమైన హైప్ దృష్ట్యా వంద కోట్ల షేర్ అన్నది లాంఛనమే అనడంలో సందేహం లేదు. టాక్ ఎలా ఉన్నా ఈ సినిమా వంద కోట్ల షేర్ సాధించడానికి అడ్డంకులేమీ లేనట్లే. ఐతే పవన్ ఆ ఘనతను సాధిస్తే సరిపోదు. దానికి రెట్టింపు వసూళ్లు రాబడితేనే ‘ఓజీ’ని సక్సెస్ ఫుల్ సినిమాగా నిలబెట్టగలడు. ఎందుకంటే ఈ సినిమాకు బిజినెస్ ఆ రేంజిలో జరిగింది. ఓజీ నైజాం హక్కులు మాత్రమే రూ.60 కోట్లు పలకడం విశేషం. ఆంధ్రా రైట్స్ రూ.75 కోట్లు, రాయలసీమయ హక్కులు రూ.25 కోట్ల దాకా పలికినట్లు సమాచారం.
ఓవర్సీస్ రైట్స్ అన్నీ కలిపితే మొత్తం బిజినెస్ లెక్క రూ.200 కోట్లకు చేరుతోంది. అంటే ఆ మేరకు ‘ఓజీ’ షేర్ రాబట్టాల్సి ఉంది. అంటే గ్రాస్ కలెక్షన్లు రూ.350 కోట్లను దాటిపోవాలి. సినిమా సోలోగా దసరా సెలవుల్లో రిలీజవుతోంది. హైప్ మామూలుగా లేదు. కాబట్టి కావాల్సిందల్లా పాజిటివ్ టాకే. అది వచ్చిందంటే ఇప్పటిదాకా రూ.100 కోట్ల షేర్ కూడా సాధించని పవన్.. నేరుగా రూ.200 కోట్ల షేర్ క్లబ్బులోకి అడుగు పెట్టేస్తాడు.
This post was last modified on August 25, 2025 5:13 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…