Movie News

ప్ర‌భాస్ నిర్మాత‌ల పోటాపోటీ

ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్‌గా అవ‌త‌రించిన‌ప్ప‌టికీ.. యువ క‌థానాయ‌కుల‌తో పోటాపోటీగా వేగంగా సినిమాలు చేస్తున్నాడు ప్ర‌భాస్. బాహుబ‌లి త‌ర్వాత కొంచెం నెమ్మ‌దిగా అడుగులు వేసిన‌ప్ప‌టికీ.. గ‌త కొన్నేళ్ల‌లో బాగా వేగం పెంచాడు. 2023 చివ‌ర్లో స‌లార్ మూవీతో ప‌ల‌క‌రించిన ప్ర‌భాస్..ఇంకో ఏడు నెల‌ల‌కే క‌ల్కి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. కొంచెం ప్లానింగ్ స‌రిగ్గా ఉంటే ఈపాటికి రాజాసాబ్ కూడా రిలీజైపోయేది. ఆ చిత్రం వ‌చ్చే సంక్రాంతికి వ‌చ్చేలా క‌నిపిస్తోంది. రాజాసాబ్‌కు సంబంధించి కొంత చిత్రీక‌ర‌ణ మిగిలి ఉంది. ఈ సినిమాలో న‌టిస్తూనే స‌మాంత‌రంగా హ‌ను రాఘ‌వ‌పూడి సినిమాలోనూ న‌టిస్తున్నాడు ప్ర‌భాస్. ఫౌజీ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఆ సినిమా కూడా స‌గం దాకా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌భాస్ కోసం ఇంకో మూడు సినిమాల మేక‌ర్స్ ఎదురు చూస్తున్నారు. ఐతే వాటిలో స‌లార్-2 మొద‌లు కావ‌డానికి టైం ప‌ట్టేలా ఉంది. ఈ చిత్రాన్ని రూపొందించాల్సిన ప్ర‌శాంత్ నీల్.. ఎన్టీఆర్‌తో డ్రాగ‌న్ తీస్తున్నాడు. కాబ‌ట్టి ఇంకో ఏడాది వ‌ర‌కు ఆ సినిమా ఊసేమీ ఉండ‌దు. ఐతే ప్ర‌భాస్ చేయాల్సిన మిగ‌తా రెండు చిత్రాల మేక‌ర్స్ త‌న కోసం గ‌ట్టిగా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీని సెప్టెంబ‌రు చివ‌ర్లో మొద‌లుపెడ‌తానని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌క‌టించాడు. ఐతే క‌ల్కి-2 మేక‌ర్స్ కూడా వీలైనంత త్వ‌ర‌గా సినిమాను మొద‌లుపెట్ట‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఆ సినిమాకు స్క్రిప్టు, ప్రి ప్రొడ‌క్ష‌న్ దాదాపుగా పూర్త‌యింది. ప్ర‌భాస్ ఎప్పుడంటే అప్పుడు ఆ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లాల‌ని అనుకుంటున్నారు. ఇది భారీగా విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో ముడిప‌డ్డ సినిమా. ప్ర‌భాస్ సహకరిస్తూ అప్పుడ‌ప్పుడు కొన్ని కాల్ షీట్స్ ఇస్తే వాటిని స‌రిగ్గా వాడుకుని సినిమాను వేగంగా పూర్తి చేయొచ్చ‌ని భావిస్తున్నారు. వేరే సినిమాలు పూర్త‌య్యే వ‌ర‌కు ఎదురు చూడాల‌ని అశ్వినీద‌త్, నాగ్ అశ్విన్ భావించ‌ట్లేదు. ఇక సందీప్ రెడ్డి మాత్రం బ‌ల్క్ డేట్స్ అడుగుతున్నాడు. ప్ర‌భాస్ త‌న సినిమా కోసం ఒకే లుక్‌లో ఉండాల‌ని కోరుకుంటున్నాడు. మ‌రి ఈ సినిమాలో న‌టిస్తూ ప్ర‌భాస్ వేరే చిత్రాల‌కు డేట్స్ స‌ర్దుబాటు చేయ‌డం అంటే అంత సులువు కాదు. మ‌రి ప్ర‌భాస్ ఎలా మేనేజ్ చేస్తాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రం.

This post was last modified on August 25, 2025 6:47 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

18 minutes ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

1 hour ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

2 hours ago

సినిమా వాయిదా… 60 కోట్ల రీఫండ్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…

2 hours ago

తిరుమలపై ఎందుకీ పగ..?

తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…

2 hours ago

ది వీక్ కవర్ పేజీపై లోకేష్.. చీఫ్ జాబ్ క్రియేటర్

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్…

3 hours ago