నిన్న విడుదలైన కూలీలో తెలుగు ప్రేక్షకుల దృష్టి నాగార్జున మీద ప్రత్యేకంగా నిలిచింది. ఎందుకంటే నలభై సంవత్సరాల కెరీర్ లో మొదటిసారి ఫుల్ లెన్త్ విలన్ వేషం వేయడంతో ఎలా ఉంటుందోననే ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో కనిపించింది. ఇలాంటి పాత్రలు చేయడం స్వతహాగా ఫ్యాన్స్ కి ఇష్టం లేనప్పటికీ లోకేష్ కనగరాజ్ మీద నమ్మకంతో చాలా ఊహించేసుకున్నారు. తెలుగు వెర్షన్ ఓపెనింగ్స్ లో ఈ అంశం బాగానే పని చేసింది. ఇక రియాక్షన్ల విషయానికి వస్తే సైమన్ గా నాగ్ ని లోకేష్ ఎందుకు అంత పర్ఫెక్ట్ ఛాయస్ గా ఎంచుకున్నాడో స్టైలింగ్ చూశాక అర్థమయ్యిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
క్యారెక్టర్ లోని ఇంటెన్సిటీని పండించిన తీరు ఆకట్టుకుంది. అయితే నిడివి పరంగా సెకండాఫ్ లో స్పేస్ తగ్గిపోవడం కొంత అసంతృప్తికి దారి తీసింది. ముగించిన విధానం పట్ల కూడా మిశ్రమ స్పందన కనిపిస్తోంది. రజనీకాంత్ తో ఫేస్ ఆఫ్ ఎపిసోడ్స్ ఇంకా పవర్ ఫుల్ గా ఉండాల్సిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే లోకేష్ కనగరాజ్ మన నాగ్ ని పూర్తి స్థాయిలో వాడుకోలేకపోయాడు. ఏడెనిమిది నెరేషన్లు ఇచ్చాడంటే జనం చాలా ఊహించేసుకున్నారు. కానీ ఫుల్ మీల్స్ ఆశిస్తే ప్లేట్ మీల్స్ దక్కినట్టు మిక్స్డ్ రియాక్షన్లు అయితే సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
ఇక జెన్యూన్ గా ఫ్యాన్స్ మనసులో మాటలని బట్టి చూస్తే కుబేర, కూలి లాంటి వాటికన్నా నా సామిరంగ, బంగార్రాజు లాంటి వాటిలో తమ హీరోని చూడాలని కోరుకున్నట్టుగా అర్థమవుతోంది. నిజానికి విలన్ క్యారెక్టర్ డిజైన్ అంటే లెజెండ్ లో జగపతిబాబులా ఉండాలి. బాలకృష్ణ లాంటి పవర్ ఫుల్ కటవుట్ ని ఎదురుగా పెట్టుకుని జగ్గు భాయ్ చూపించిన విలనిజం తెరమీద అద్భుతంగా పండింది. ఒకవేళ అదే స్థాయిలో కనక సైమన్ ని ప్రెజెంట్ చేసి ఉంటే నాగార్జున ఇవాళ ఆన్ లైన్ టాపిక్ అయ్యేవారు. ఫైనల్ రిజల్ట్ తేలాక ఇకపై ఇలాంటి సినిమాలు చేయలా వద్దానే నిర్ణయం తీసుకోవాలని నాగ్ ఫిక్సయ్యారట. మంచిదే.
Gulte Telugu Telugu Political and Movie News Updates