మోనల్ గజ్జర్‍కి బిగ్‍బాస్ క్రియేటివ్ టీమ్ ఆశీస్సులున్నాయని మొదట్నుంచీ ఆరోపణలు వస్తున్నాయి. ఆమె వల్ల షోకి అవసరమయిన మసాలా కంటెంట్ లభిస్తూ వుండడంతో తనను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారని ఎన్ని ఆరోపణలు వచ్చినా కానీ మోనల్ ప్రతిసారీ సేవ్ అవుతూనే వస్తోంది. అయితే ఈసారి మాత్రం మోనల్ ఎలిమినేట్ కాక తప్పదనిపిస్తోంది. ఎందుకంటే నామినేట్ అయిన వారిలో మోనల్, అరియానా, లాస్యకు తక్కువ ఓట్లు పోలవుతున్నాయి. అయితే లాస్య, మోనల్‍కి ఫ్యామిలీ రీయూనియన్ ఎపిసోడ్ ఫెట్చింగ్ అయింది. మోనల్ ఎపిసోడ్‍ని మరింత నాటకీయంగా మలచి ఆమెకు జాలితో ఓట్లు పడేట్టు చూసుకున్నారు.
ఒకవేళ నిజంగా అది ఎఫెక్టివ్‍గా పని చేసినట్టయితే ఈ వారం ఆమె కాకుండా ఎవరు ఎలిమినేట్ అవుతారు? అరియానా, హారిక ఇద్దరిలో ఒకరు అవుట్ అవ్వవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీజన్లో సర్‍ప్రైజ్ ఎలిమినేషన్లు చాలానే జరిగాయి కాబట్టి ఈసారి కూడా మోనల్‍ని సేవ్ చేసి సోషల్ మీడియా స్టార్స్ అయిన అరియానా, హారికల్లో ఒకరిని ఇంటికి పంపిస్తారనే టాక్ హల్ చల్ చేస్తోంది. అరియానా ఓవరాక్షన్ కూడా తన ఓటింగ్‍ని ప్రభావితం చేస్తోందనేది స్పష్టంగా కనిపిస్తోంది. మరి ‘బోల్డ్ పాప’ ఈసారి బయటకు పోకుండా సేవ్ అవుతుందా?
Gulte Telugu Telugu Political and Movie News Updates