ఒకప్పుడు సౌత్ ఇండియాలో రజినీకాంత్‌ను మించిన స్టార్ లేడు అన్నట్లుండేది పరిస్థితి. ఆయన సినిమాల బడ్జెట్లు, బిజినెస్‌లు, వసూళ్లు అన్నీ కూడా వేరే లెవెల్లో ఉండేవి. వంద కోట్ల వసూళ్లు వస్తే అద్భుతం అనుకునే రోజుల్లోనే ‘రోబో’ మూవీతో వందల కోట్ల వసూళ్లు తెచ్చిపెట్టిన ఘనత ఆయన సొంతం. ఐతే గత కొన్నేళ్లలో రజినీ నటించిన పలు చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ‘జైలర్’ను మినహాయిస్తే అన్నీ ఫెయిల్యూర్లే.
పేట, పెద్దన్న, వేట్టయాన్ లాంటి చిత్రాలకు అయితే అసలు హైపే లేదు. ‘జైలర్’ కూడా రిలీజ్ తర్వాతే పుంజుకుంది. కానీ సూపర్ స్టార్ కొత్త చిత్రం ‘కూలీ’ సంగతి మాత్రం వేరు. ఈ సినిమా మొదలైన దగ్గర్నుంచే మంచి హైప్ తెచ్చుకుంది. రిలీజ్ టైంకి ఆ హైప్ మల్టిప్లై అయింది. గత కొన్నేళ్లలో ఇంత హైప్ తెచ్చుకున్న సినిమా ఇంకోటి లేదు అనే పరిస్థితి కనిపిస్తోంది.
‘కూలీ’కి అడ్వాన్స్ బుకింగ్స్ అలా జరుగుతున్నాయి మరి.
‘కూలీ’ ఫస్ట్ షో పడడానికి ముందే వసూళ్లు రూ.100 కోట్లను టచ్ చేసేలా కనిపిస్తుండడం విశేషం. ఇప్పటికే వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఈ చిత్రం రూ.70 కోట్ల దాకా రాబట్టింది. సినిమా రిలీజ్ కావడానికి ఇంకా ఒక రోజు పైన సమయం ఉంది కాబట్టి.. ఆలోపు బుకింగ్స్‌తో రూ.100 కోట్ల మార్కును టచ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే వంద కోట్ల వసూళ్లంటే మామూలు విషయం కాదు. ఇక రిలీజ్ రోజు వసూళ్లను కూడా కలుపుకుంటే ‘కూలీ’ డే-1 రూ.150 కోట్ల మార్కును కూడా దాటే అవకాశముంది. తమిళ సినిమా ఓపెనింగ్ రికార్డులన్నింటినీ ఈ చిత్రం బద్దలు కొట్టడం లాంఛనమే. అమెరికాలో ఆల్రెడీ ఈ చిత్రం 3 మిలియన్ ప్రి సేల్స్‌కు చేరువగా ఉంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్ వసూళ్లు కూడా అనూహ్యంగా ఉంటాయన్నది స్పష్టం. వెయ్యి కోట్ల సినిమా కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న కోలీవుడ్ ‘కూలీ’తో ఆ మార్కును టచ్ చేస్తుందనే అంచనాలున్నాయి. కావాల్సిందల్లా పాజిటివ్ టాకే.
Gulte Telugu Telugu Political and Movie News Updates