ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టార్ పవర్ తో సంబంధం లేకుండా సినిమా చిన్నదైనా పెద్దదైనా పెట్టుబడి వస్తే చాలు భగవంతుడాని నిర్మాతలు కోరుకుంటున్నారు. లాభాలు వస్తే అదృష్టం అన్నట్టు. కానీ సైయారా మాత్రం రూపాయికి పది రూపాయలు లాభం పంచుతూ డిస్ట్రిబ్యూటర్లను కనక వర్షంలో ముంచెత్తుతోంది. ఓవర్సీస్ లో చావా ఫైనల్ రన్ ని కేవలం రెండు వారాల్లోనే దాటేయడం చూసి బయ్యర్లకు నోటమాట రావడం లేదు. చావా 91 కోట్లు వసూలు చేస్తే సైయారా 94 కోట్లు దాటేసి వంద మార్కు వైపు పరుగులు పెడుతోంది. అసలు ఎక్కడ ఎప్పుడు ఆగుతుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. అంతగా దుమారం రేపుతోంది.
ఇంతా చేసి సైయారాకు అయిన బడ్జెట్ కేవలం 30 కోట్లు. ఇప్పటిదాకా 400 కోట్ల గ్రాస్ దాటిపోయింది. అర సహస్రం ఈ వీకెండ్ లో అయిపోతుంది. దీని తర్వాత కొత్త రిలీజులు హరిహర వీరమల్లు, మహావతార్ నరసింహ, సామ్రాజ్య, సన్నాఫ్ సర్దార్ 2, ధఢక్ 2 లాంటివి ఎన్ని వచ్చినా, వస్తున్నా సైయారా మాత్రం జోరు కొనసాగిస్తూనే ఉంది. నిర్మాణ భాగస్వామిగా ఉన్న యష్ రాజ్ ఫిలిమ్స్ మార్కెటింగ్ ప్లాన్ బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యింది. మొదటి రోజు ఆఫర్లు ఇచ్చి వదిలేస్తే తర్వాత జనం వద్దన్నా ఎగబడుతున్న వైనం బాక్సాఫిస్ వద్ద కనిపిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే మరీ దూసుకెళ్ళిపోతోంది.
విచిత్రం ఏంటంటే తెలుగు రాష్ట్రాల జిల్లా కేంద్రాలు, నగరాల్లో సైయారాని థర్డ్ వీక్ లోనూ కొనసాగిస్తున్నారు. ఇది ఒక కరంగా రేర్ ఫీట్ అని చెప్పాలి. ఎందుకంటే షారుఖ్, సల్మాన్ లాంటి వాళ్లే ఇంత లాంగ్ రన్ ని మైంటైన్ చేయలేక ఇబ్బంది పెడుతున్న ట్రెండ్ లో ఒక కొత్త జంట నటించిన లవ్ స్టోరీ ఇంత సెన్సేషన్ కావడం వింత కాక మరేమిటి. ఆహాన్ పాండే ఒక్కసారిగా హాట్ కేక్ అయిపోయాడు. దర్శకుడు మోహిత్ సూరికి మళ్ళీ డిమాండ్ పెరిగింది. హీరోయిన్ అనీత్ పడ్డా సంగతి సరేసరి. అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇంతకీ సైయారా స్పీడ్ ని ఆపే మూవీ వార్ 2, కూలి అవుతాయేమో.
This post was last modified on July 31, 2025 5:21 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…