ఊహించని ఓపెనింగ్స్ తో కింగ్డమ్ భారీగా విడుదలైపోయింది. టీమ్ ఆనందంతో మొదటి షో పడిన కొన్ని గంటల్లోనే ప్రెస్ మీట్ పెట్టేసి సంతోషాన్ని పంచుకుంది. నిర్మాత నాగవంశీ, హీరో విజయ్ దేవరకొండ, సత్యదేవ్, వెంకిటిష్ ఇందులో పాల్గొన్నారు. తెలంగాణలో ఎక్కువగా ఆదరణ ఉండే విజయ్ దేవరకొండ ఈసారి సీడెడ్ లో అదరగొట్టాడని, ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం 50 శాతం రికవరీ మొదటి రోజే అయిపోతుందని, ఓవర్సీస్ లోనూ ఇదే మేజిక్ జరుగుతోందని చెప్పుకొచ్చారు. గురువారం రిలీజ్ గురించి టెన్షన్ పడ్డానని చెప్పిన విజయ్ ప్రొడ్యూసర్ భరోసా నిజమైనందుకు మాటలు రావడం లేదని తన భావాలు పంచుకున్నాడు.
ఈ సందర్భంగా కింగ్డమ్ 2 ప్రస్తావన వచ్చింది. త్వరలోనే సీక్వెల్ ఉంటుందని, విజయ్ దేవరకొండ కమిట్ మెంట్స్ పూర్తయ్యాక ప్లాన్ చేస్తామని అన్నారు. క్లైమాక్స్ లో చూపించిన సేతు పాత్రని ఒక స్టార్ హీరో చేస్తారని, అది చూశాక సర్ప్రైజ్ అవుతారని నాగవంశీ ఊరించారు. ఎక్కువ ప్రాధాన్యం దక్కని హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు పార్ట్ 2లో ఇంపార్టెన్స్ ఉంటుందని వివరణ ఇచ్చారు. మొత్తానికి ఫ్యాన్స్ కి కొనసాగింపు గురించి క్లారిటీ అయితే వచ్చింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో పీరియాడిక్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రత్యేకంగా పెంచిన మీసకట్టు దాని కోసమే.
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందే ఈ ప్యాన్ ఇండియా మూవీ కాగానే లేదా సమాంతరంగా దిల్ రాజు నిర్మించే రౌడీ జనార్దన్ మొదలవుతుంది. దీనికి రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకుడు. ఎంతలేదన్నా వీటికి ఏడాదిన్నరకు పైగానే గడిచిపోతుంది. అప్పుడు కింగ్డమ్ 2 స్టార్ట్ చేయాలి. అసలు ముందు కింగ్డమ్ ఫైనల్ స్టేటస్ తెలియాలి. ఇదింకా మొదటి రోజే కాబట్టి కంప్లీట్ రన్ అయ్యాక కమర్షియల్ స్టామినా గురించి క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేయాలి. లైగర్, ఫ్యామిలీ స్టార్ గాయాల నుంచి కింగ్డమ్ ఏ మేరకు ఊరట కలిగించిందో ఇంకో వారం రోజుల్లో తేలిపోతుంది. చూద్దాం.
This post was last modified on July 31, 2025 7:06 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…