ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో రావాల్సినవి రెండే ఉన్నాయి. ఓజి షూటింగ్ పూర్తి చేసుకుని సెప్టెంబర్ 25 రిలీజ్ కు రెడీ అవుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ చివరి దశలో ఉంది. వారం లోపే గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. హరిహర వీరమల్లు పార్ట్ 1 ఫలితం చూశాక రెండో భాగం మీద ఆశలు సన్నగిల్లాయి. ఒకవేళ నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణలు పూనుకున్నా ఫ్యాన్సే వద్దనేలా ఉన్నారు. వీటి సంగతి పక్కనపెడితే పవన్ ఎప్పుడో కమిట్ మెంట్ ఇచ్చిన మూవీ మరొకటి ఉంది. నిర్మాత రామ్ తాళ్ళూరితో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఫీషియల్ ప్రకటన వచ్చి ఏళ్ళు గడిచిపోయాయి. తర్వాత అప్డేట్ లేదు.
తాజా సమాచారం మేరకు ఇది కూడా లైన్ లోకి వస్తోందట. అయితే సురేందర్ రెడ్డి ముందు చెప్పిన కథకు ఎక్కువ డేట్స్, భారీ బడ్జెట్ అవసరం ఉండటంతో దాన్ని పక్కనపెట్టేసి ఒక తమిళ రీమేక్ ని పవన్ సూచించినట్టు ఒక గాసిప్ ఇండస్ట్రీ వర్గాల్లో తిరుగుతోంది. రాజకీయంగా తానున్న బిజీలో ఎక్కువ స్ట్రెయిట్ ఫిలింస్ చేయలేనని, వేగంగా పూర్తయ్యే ఛాన్స్ ఉన్న రీమేకుల మీద దృష్టి పెట్టడం తప్ప వేరే ఆప్షన్ లేదని సూరికి చెప్పినట్టుగా వినికిడి. ఏజెంట్ తో దారుణమైన డిజాస్టర్ మూటగట్టుకున్న సురేందర్ రెడ్డికి ఎస్ అనడం మినహా మరో మార్గం ఉండదు. ఎందుకంటే పవన్ తో చేయడానికి వచ్చిన లైఫ్ టైం ఆపర్చునిటి ఇది.
ప్రస్తుతానికి ఇదంతా గాసిప్ స్టేజిలోనే ఉంది. ఇంకా నిర్ధారణగా తెలియలేదు. రామ్ తాళ్ళూరికి సినిమా అయిదారేళ్లుగా పవన్ కళ్యాణ్ పెండింగ్ లో పెడుతూ వచ్చారు. కథ దర్శకుడి కాంబో కుదరక ఇలా లేట్ అవుతూ వచ్చింది. ఇంకా ఎన్నికలకు నాలుగు సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఈ లోగా మరో ఒకటి రెండు సినిమాలు చేసే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్న మాట వాస్తవం. అది కూడా ఎవరైతే శరవేగంగా తీస్తారో వాళ్ళతో మాత్రమే అనే కండీషన్ మీద. మరి నెమ్మదిగా ఉండే సురేందర్ రెడ్డి పవన్ కోసం తన శైలిని మార్చుకోక తప్పదు. చూడాలి ఇంకెలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయో.
This post was last modified on July 31, 2025 9:19 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…