భారీ అంచనాలతో కింగ్డమ్ థియేటర్లలో అడుగు పెట్టేసింది. యుఎస్ ప్రీమియర్ షోల నుంచి మంచి రిపోర్టులు రావడం శుభ పరిణామం. ఇండియాలో ఏడు గంటల నుంచి ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మధ్యాన్నానికి క్లారిటీ వచ్చేస్తుంది. తక్కువ టైం ఉన్నా సరే ఎక్కువ ప్రమోషన్లు చేసుకోవడంలో టీమ్ సక్సెసయ్యింది. ముఖ్యంగా ట్రైలర్ కట్ ని డిజైన్ చేసిన తీరు అంచనాలు పెంచింది. ఏదో రెగ్యులర్ మూవీ అనిపించకుండా ఇంటెన్స్ డ్రామా క్రియేట్ చేశారన్న అభిప్రాయం ఆడియన్స్ లో కలిగింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ లోనే ట్రెండ్ చూపించడం సాధ్యమయ్యింది.
ప్రీమియర్లతో అర మిలియన్ దాటేసిన కింగ్డమ్ ఒకవేళ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం రెండు వారాల పాటు వసూళ్లను కొల్లగొట్టేయొచ్చు. హరిహర వీరమల్లు ఫలితం తేలిపోయిన నేపథ్యంలో ఇప్పుడు అందరి కళ్ళు దీని మీదే ఉన్నాయి. థియేటర్ ఆక్యుపెన్సీలు అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితిలో విజయ్ దేవరకొండ తిరిగి హౌస్ ఫుల్స్ పెడతాడనే అభిప్రాయం బయ్యర్ వర్గాల్లో బలంగా ఉంది. గత ఫ్లాపుల ప్రభావం లేకుండా విజయ్ దేవరకొండకు గౌతమ్ తిన్ననూరి, అనిరుధ్ రవిచందర్ అండగా నిలబడ్డారు. దానికి తోడు సితార ఎంటర్ టైన్మెంట్స్ మార్కెటింగ్ చాలా ప్లస్ అయ్యింది.
సరిగ్గా పధ్నాలుగు రోజుల టైం కింగ్డమ్ కు ఉంది. ఆగస్ట్ 14 కూలీ, వార్ 2 వచ్చేనాటికి వాతావరణం మారిపోతుంది. జూనియర్ ఎన్టీఆర్, రజనీకాంత్ ల మీదకు ఫోకస్ షిఫ్ట్ అయిపోతుంది. ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా సరే కింగ్డమ్ ఆలోగానే గరిష్టంగా వసూళ్లు రాబట్టేయాలి. టాక్ బాగుంటే బ్రేక్ ఈవెన్ తో లాభాలు కూడా పెద్ద కష్టమేమీ కాదు. వంద కోట్ల గ్రాస్ వస్తే ఈజీగా గట్టెక్కొచ్చు. చేతిలో ఉన్న టైంతో అది సాధ్యమే. కథలు దర్శకుల ఎంపికలో పొరపాట్లు చేస్తూ వచ్చిన విజయ్ దేవరకొండ ఫైనల్ గా సరైన టీమ్ ని అందుకున్నాడు. మరి రిజల్ట్ కూడా సానుకూలంగా ఉంటే తనతో పాటు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న బ్రేక్ దొరికినట్టే.
This post was last modified on July 31, 2025 9:12 am
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్‌కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…