మీడియా ఇంటర్వ్యూల్లో, ప్రెస్ మీట్లలో చాలా ఓపెన్‌గా మాట్లాడే టాలీవుడ్ నిర్మాతల్లో నాగవంశీ ఒకరు. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద సక్సెస్ ఫుల్‌గా సాగిపోతున్న నాగవంశీ.. మీడియా వాళ్ల ప్రశ్నలకు చాలా కొంటెగా సమాధానాలు ఇస్తుంటాడు. ఇండస్ట్రీలో జరిగే విడ్డూరాల మీద కూడా ఆయన సెటైరిగ్గానే స్పందిస్తుంటారు. పెద్ద సినిమాలకు వేసే కలెక్షన్ల పోస్టర్ల గురించి ఇప్పటికే ఒకట్రెండు సందర్భాల్లో కౌంటర్లు వేశారు నాగవంశీ. ఇప్పుడు మరోసారి ఇదే విషయమై పంచ్ వేశారు.
తన ప్రొడక్షన్ నుంచి గురువారం విడుదలవుతున్న ‘కింగ్‌డమ్’ సినిమాకు మంచి బజ్ కనిపిస్తున్న నేపథ్యంలో తొలి రోజు ఎంత వసూళ్లు రాబడుతుందని అడిగితే.. కలెక్షన్ పోస్టర్‌ది ఏముంది, ఎంత కావాలంటే అంత వేసుకుందాం అంటూ ఆయన స్పందించడం అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఆయనీ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ రోజుల్లో ఒక సినిమాకు మంచి ఓపెనింగ్ తెచ్చుకోవడమే పెద్ద సవాలుగా మారిందని.. ఆ విషయంలో తాము సక్సెస్ అయ్యామని.. సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయి, అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగా జరుగుతున్నాయని నాగవంశీ తెలిపాడు.
తొలి రోజు కూడా మంచి టాక్ వస్తుందని, కలెక్షన్లు చాలా బాగుంటాయని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలోనే కలెక్షన్ల పోస్టర్‌దేముంది ఎంత కావాలంటే అంత వేసుకుందాం అంటూ ఇండస్ట్రీలో కలెక్షన్లు పెంచి పోస్టర్లు వేయడం అనే కామన్ ప్రాక్టీస్ మీద సెటైర్ వేశాడు నాగవంశీ.
ఇక ఈ సినిమా ట్రైలర్లో కథ ఎక్కువగా రివీల్ చేయకపోవడం గురించి నాగవంశీ మాట్లాడుతూ.. ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచడానికి, అంచనాలు మరీ ఎక్కువ కాకుండా ఉండడానికే అలా చేశామని చెప్పాడు. తన అన్నను కాపాడడానికి హీరో ఎంత వరకు వెళ్లాడన్నదే ఈ సినిమా కోర్ పాయింట్ అని నాగవంశీ తెలిపాడు. సినిమా మొదలైన పది నిమిషాల తర్వాత ‘కింగ్‌డమ్’ అనే టైటిల్ వెనుక మర్మం ఏంటో అర్థమవుతుందని.. శ్రీలంక నేపథ్యంలో నడిచే సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్ అవుతాయని నాగవంశీ చెప్పాడు.
This post was last modified on July 30, 2025 3:55 pm
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్‌కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…