ఒక స్టార్ హీరో వరుసగా రెండు మూడు డిజాస్టర్లు ఇచ్చాడంటే.. ఆ ప్రభావం తర్వాతి చిత్రం మీద పడడం సహజం. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో ఉండవు. ఓపెనింగ్స్ తగ్గిపోతాయి. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఇందుకు మినహాయింపుగానే నిలుస్తున్నాడు. అతడి చివరి చిత్రం ఫ్యామిలీ స్టార్ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. దాని కంటే ముందు వచ్చిన ఖుషి కూడా సరిగా ఆడలేదు. దాని కంటే ముందు వచ్చిన లైగర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంకా వెనక్కి వెళ్తే డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి డిజాస్టర్లున్నాయి. అతను ఎప్పుడు నిఖార్సయిన హిట్టు కొట్టాడో తన ఫ్యాన్స్ కూడా మరిచిపోయారు.
ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ విజయ్ కొత్త చిత్రం కింగ్‌డమ్ మీద ఆ ప్రభావం ఏమీ కనిపించడం లేదు. ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజిలో జరుగుతన్నాయి. మొదటి నుంచి కింగ్‌డమ్ లుక్ చాలా బాగా కనిపిస్తుండడం.. విజయ్‌కి మంచి క్యారెక్టర్ పడిన సంకేతాలుండడం.. ప్రోమోలన్నీ బాగుండడం.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించడం.. మ్యూజిక్ అదిరిపోవడం.. ఇలా చాలా ఫ్యాక్టర్లు కలిసి వచ్చి ఈ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. రిలీజ్ టైంకి హైప్ ఇంకా పెరిగింది. అన్నీ సానుకూలంగా కనిపిస్తుండడంతో అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ సినిమా జోరు చూపిస్తోంది.
హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని మేజర్ సిటీస్ అన్నింట్లో కింగ్‌డమ్ షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో కనిపిస్తున్నాయి. అర్లీ మార్నింగ్ షోలు అన్నీ సోల్డ్ ఔట్ అయిపోయినట్లే ఉన్నాయి. చాలా వైడ్ రిలీజ్ ఉన్నప్పటికీ షోలన్నీ ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో ఉండడం సానుకూల సంకేతం. హైదరాబాద్ సిటీలో పెద్ద మల్టీప్లెక్సులు తొలి రోజు ఈ చిత్రానికి 15-20 దాకా షోలు ఇచ్చాయి. అన్నింటికీ రెస్పాన్స్ బాగుంది. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఈ సినిమా రూ.7 కోట్ల మార్కును దాటేసినట్లు ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. వరుసగా ఎన్ని ఫ్లాపులు ఇచ్చినా.. తన కొత్త చిత్రానికి ఇలాంటి స్పందన వస్తుండడం విజయ్ స్టార్ పవర్‌ను సూచిస్తుంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టబోతున్నట్లే.
This post was last modified on July 30, 2025 10:39 am
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…
పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…
కొడాలి నాని. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపీ హయాంలో ప్రత్యర్థులు ఆయనకు “బూతుల మంత్రి” అనే…
డిజిటల్ యుగానికి అనుగుణంగా ప్రభుత్వం ఆన్‌లైన్ రైతు బజార్‌ను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్‌గా విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ రైతు బజార్…
సాధారణంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశాలు మూసివున్న గదుల్లో, గోప్యంగా సాగుతుంటాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న కలెక్టర్ల…