ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మంచి ఊపు మీదున్నారు. హరిహర వీరమల్లు థియేటర్ రన్ ఇంకా కొనసాగుతుండగానే ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్స్ మొదలుపెట్టేశారు. తాజాగా జరిగిన షెడ్యూల్ లో క్లైమాక్స్ పూర్తయినట్టు మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. కొంచెం వర్క్ మినహాయించి పవన్ వర్క్ దాదాపు అయిపోయినట్టే. పాటల అప్డేట్ ఇంకా తెలియాల్సి ఉంది. నిజానికి ఇంత స్పీడ్ ఫ్యాన్స్ ఊహించలేదు. ఎలాగూ సెప్టెంబర్ లో ఓజి ఉంది కాబట్టి ఉస్తాద్ ఇంకొంచెం ఆలస్యమైనా పరవాలేదని అనుకున్నారు. తీరా చూస్తే దర్శకుడు హరీష్ శంకర్ జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టించి తుది ఘట్టానికి చేర్చేశాడు.
తేరి రీమేక్ గా మొదలైన ఈ యాక్షన్ మూవీ తర్వాత స్ట్రెయిట్ సబ్జెక్టుగా మారిందనే ప్రచారం జరిగింది కానీ అదెంత వరకు నిజమో సినిమా చూస్తే కానీ క్లారిటీ రాదు. ఇన్ సైడ్ టాక్ అయితే మెయిన్ పాయింట్ మాత్రమే తీసుకుని గుర్తుపట్టలేని మార్పులు చాలా చేశారని, పూర్తిగా ఫ్రెష్ ట్రీట్ మెంట్ తో ఫ్యాన్స్ ఊహించని స్థాయిలో మాస్ మీల్స్ ఉంటాయని టీమ్ సభ్యులు ఊరిస్తున్నారు. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా, పార్తీబన్ విలన్ గా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది. ఇదే కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ని మించిన టెర్రిఫిక్ ఆల్బమ్ ని మూవీ లవర్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.
ఇదంతా చూస్తుంటే నవంబర్ కల్లా ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ కాపీ రెడీ అయిపోయినా ఆశ్చర్యం లేదు. కాకపోతే విడుదల తేదీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఓజి సెప్టెంబర్ లో వచ్చేది ఖాయమే అయితే రెండు నెలల్లో రెండు పవన్ కళ్యాణ్ సినిమాలు వచ్చిన అరుదైన రికార్డు ఉంటుంది. అప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి 2026 వేసవిలో ఉస్తాద్ ని దింపితే బాగుంటుంది. రాజకీయాల దృష్ట్యా పవన్ ఇకపై సినిమాలు చేయడం అనుమానంగా ఉంది కాబట్టి దానికి అనుగుణంగా రిలీజ్ ప్లాన్స్ ఉండాలి. అన్నట్టు ఉస్తాద్ భగత్ సింగ్ లో మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ మంచి పవర్ ఫుల్ ఫైట్స్ ఉన్నాయట. ఫ్యాన్స్ కోరుకునేది అవేగా.
This post was last modified on July 29, 2025 12:59 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…