ఎల్లుండి విడుదల కాబోతున్న కింగ్డమ్ కు ముందు రోజు అంటే రేపు రాత్రి స్పెషల్ ప్రీమియర్లు వేసే ప్లాన్ లో నిర్మాతలున్నట్టు ఒక వార్త బాగానే తిరిగింది. కానీ తర్వాత ఆ నిర్ణయం మార్చుకున్నారు. ఏపీలో టికెట్ రేట్ల పెంపుకి సంబంధించి అనుమతులు జూలై 31 నుంచే ఇచ్చినందు వల్ల పాత ధరలతో స్పెషల్ షోలు వేస్తే ఇబ్బందవుతుంది. అందుకే ఈ ఆలోచన మానుకున్నారనేది ఓపెన్ సీక్రెట్. అయితే ప్రాక్టికల్ కోణంలో ఆలోచిస్తే బుధవారం ప్రీమియర్లు ఎలా చూసుకున్నా రిస్క్ తో ముడిపడి ఉంటాయి. కంటెంట్ కాసేపు పక్కన పెడితే ఇటీవలే హరిహర వీరమల్లుకి అర్ధరాత్రి ఇవి చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు.
వీకెండ్ కాని వర్కింగ్ డే రోజు నైట్ ప్రీమియర్లు వేయడం చిన్న హీరోలకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే విడుదల రోజు ఉదయం ఆటకే జనాలు పరిగెత్తుకు రారు కాబట్టి సోషల్ మీడియా టాక్ కోసం అలా చేయడం సహజం. గతంలో తేజ సజ్జ, సుహాస్ లాంటి హీరోలు ఈ స్ట్రాటజీ వల్ల లాభపడ్డారు. కానీ విజయ్ దేవరకొండ వాళ్ళ సరసన రాడు. ఫ్లాపుల సంగతి సరికాని తనకు ఇప్పటికీ టయర్ 2 క్యాటగిరీలో మంచి డిమాండ్ ఉంది. అందుకే వరసగా సితార, మైత్రి, దిల్ రాజు బ్యానర్లలో ప్యాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు. కింగ్డమ్ తన కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందింది కాబట్టి అస్సలు రిస్క్ తీసుకోకూడదు.
ఎలాగూ గురువారం రిలీజ్ కనక నాలుగు రోజుల వీకెండ్ దొరుకుతుంది. హరిహర వీరమల్లు స్లో అయిపోయాడు. ఫలితం స్పష్టంగా కనిపిస్తోంది. మహావతార్ నరసింహ రెండో వారం జోరు చూపించినా మాస్ ఆడియన్స్ మొగ్గు కింగ్డమ్ వైపే ఉంటుంది. అందులోనూ రెండు ఈవెంట్లు, ట్రైలర్, కదిలే సాంగ్ దెబ్బకు హైప్ అమాంతం పెరిగింది. అంచనాలు నిలబెట్టుకోవడమే బాలన్స్. ముందు రోజు షోలు వేసి టాక్ దెబ్బ తీసుకునే అవకాశం ఇవ్వకుండా ప్రాపర్ రిలీజ్ డేట్ నాడు ఉదయం ఏడు గంటలనుంచి షోలు వేయడం మంచి స్ట్రాటజీ. మేకర్స్ చాలా తెలివిగా అలోచించి నిర్ణయం తీసుకున్నారు.
This post was last modified on July 29, 2025 11:31 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…