Movie News

బక్కోడి బ్యాంగ్ సరిపోయిందా?

హైదరాబాద్ లో పబ్లిక్ స్టేజి మీద వేలాది అభిమానులను ఉద్దేశించి అనిరుద్ రవిచందర్ లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం ఇవాళ కింగ్డమ్ ఈవెంట్ మీద ప్రత్యేక ఆసక్తి కలిగేలా చేసింది. యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ వేడుకలో అందరి దృష్టి ఇతని మీదే ఉంది. సినిమాలో చార్ట్ బస్టర్ అయిన కదిలే కదిలే సాంగ్ ప్రత్యక్షంగా పాడటమే కాకుండా దేవరలో దూకే ధైర్యమ జాగ్రత్త, చుట్టమల్లే ఓ రెండు లైన్లు పాడి మమ అనిపించాడు. కింగ్డమ్ సాంగ్ మాత్రమే రెండున్నర నిముషాలు పెర్ఫార్మ్ చేయడం హైలైటయ్యింది. అయితే నిజానికి ఫ్యాన్స్ ఆశించింది చాలా ఎక్కువ. అంత మోతాదు అనిరుద్ ఇవ్వలేదు.

దానికి కారణాలు లేకపోలేదు. అనిరుద్ స్టేజి మీద లైవ్ ఆర్కెస్ట్రా సెట్ చేసుకోలేదు. మాములుగా ఇలాంటి ఈవెంట్స్ చేసినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ బృందం మొత్తం హాజరవ్వాలి. గ్రూప్ డాన్సర్స్ ఉన్నారు కానీ తన పర్సనల్ టీమ్ ఎక్కువగా కనిపించలేదు. కరోకే పద్దతిలో బీజీఎమ్ ప్లే చేస్తూ అనిరుద్ లైవ్ లో పాడటం ద్వారా మంచి ఫీలింగ్ అయితే ఇచ్చాడు కానీ అభిమానుల కోణంలో చూసుకుంటే డోస్ సరిపోలేదు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆడియో లాంచ్ కాదు. అందుకే అనిరుద్ ని ఎక్కువ హైలైట్ చేయడం సాధ్యపడలేదు. మరో సంగతి ఇక్కడ చెప్పుకోవాలి.

అనిరుధ్ హుకుం పేరుతో లైవ్ టూర్స్ చేస్తున్నాడు. వచ్చే నెల మూడో వారంలో చెన్నై వేదికగా భారీ ఎత్తున కన్సర్ట్ జరగబోతోంది. టికెట్ రేట్లు భారీగా ఉన్నా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అలాంటి చోట ప్రత్యేకంగా పెర్ఫార్మ్ చేయడానికి అనిరుద్ చేసుకునే ఏర్పాట్లు వేరే ఉంటాయి. ఇలా కింగ్డమ్ లాంటి సినిమా వేడుకల్లో వాటిని పెట్టలేడు. సో ఈ కోణంలో చూసుకుంటే అనిరుద్ చేసింది రైటే. ఈ మాత్రం భాగ్యానికి కూడా గతంలో తను కంపోజ్ చేసిన తెలుగు సినిమాలు నోచుకోలేదు. ఇప్పుడు విజయ్ దేవరకొండ మూవీ శ్రీకారం చుట్టింది కాబట్టి ఇకపై టాలీవుడ్ స్ట్రెయిట్ ఈవెంట్స్ లో అతన్ని తరచుగా కలుసుకోవచ్చు.

This post was last modified on July 28, 2025 9:41 pm

Share

Recent Posts

సంక్రాంతి థియేటర్ల కోసం యుద్ధాలు చేయాలేమో

ఇంకా నాలుగు నెలలు ఉండగానే 2027 సంక్రాంతి గురించి ఇండస్ట్రీ వర్గాలు, డిస్ట్రిబ్యూటర్లలో విపరీతమైన చర్చలు మొదలయ్యాయి. నేనంటే నేనంటూ…

2 hours ago

నేపాల్‌లో జ‌ల ప్ర‌ళ‌యం… టిబెట్‌పై చైనా కుట్ర చేసిందా?!

భార‌త పోరుగు దేశం, దేవ‌భూమి నేపాల్‌లో ఒక్క‌సారిగా సంభ‌వించిన జ‌ల ప్ర‌ళ‌యం.. ప్ర‌జ‌ల‌ను అత‌లాకుత‌లం చేసింది. ఒక్క‌సారిగా ఉప్పొంగిన కోశీ…

3 hours ago

తక్కువ బడ్జెట్ హనుమాన్… హిట్టు కొట్టేసింది  

మూడు సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో కొత్త రికార్డులు తిరగరాస్తూ హనుమాన్ ఎంత సంచలన విజయం సాధించిందో మూవీ లవర్స్…

3 hours ago

రవితేజ ఇకపై మరింత జాగ్రత్తగా

వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్న టైంలో రవితేజకు ఇరుముడి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. విజయం ఊహించిందే కానీ మరీ రికార్డులు బద్దలు…

4 hours ago

సందీప్ వంగ ప్రభావం ఆ స్థాయిలో ఉంది

తెలుగు దర్శకుల్లో కొందరు మాత్రమే ఒక జనరేషన్ ని ప్రభావితం చేసే స్థాయిలో సినిమాలు తీస్తారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో…

5 hours ago

పులివెందుల టికెట్ వదులుకుంటారా జగన్ సార్?

ఏ పార్టీ అయినా.. తీసుకునే నిర్ణ‌యాలు.. చేసే ప్ర‌క‌ట‌నల విష‌యంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలి. స‌మ‌యం వ‌చ్చింద‌నో.. సంద‌ర్భం చిక్కింద‌నో…

6 hours ago