కొన్ని నిర్ణయాలు లైఫ్ లోనే కాదు సినిమాలకు సంబంధించి కూడా టైంకి తీసుకోవాలి. లేదంటే ఆశించిన ఫలితాలు దక్కవు. రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన రంగస్థలం ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేని కల్ట్ మూవీ. వచ్చి ఇన్ని సంవత్సరాలవుతున్నా సుకుమార్ తాలూకు మేజిక్ ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ మాటకొస్తే పుష్ప కన్నా బెస్ట్ వర్క్ ఇందులోనే ఉంటుందని చెప్పేవాళ్ళు ఎక్కువగా ఉన్నారంటే అది అబద్దం కాదు. అన్ని బాషల ఆడియన్స్ ని ఆకట్టుకునే కంటెంట్ ఉన్న రంగస్థలం హిందీ వెర్షన్ థియేట్రికల్ గా రిలీజ్ కాకపోవడం అభిమానులు ఇప్పటికీ వెలితిగా ఫీలవుతూ ఉంటారు.
నిజానికి రంగస్థలంలో నార్త్ ఆడియన్స్ ని ఆకట్టుకునే కంటెంట్ పుష్కలంగా ఉంది. కానీ నిర్మాతలు ఆ దిశగా ఎప్పుడూ ఆలోచన చేయకపోవడం విచిత్రం. పోనీ ఆర్ఆర్ఆర్ వచ్చాక రామ్ చరణ్ కు పెరిగిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ విడుదల చేయమని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కోరుకున్నా సరే నెరవేరలేదు. త్వరలో గోల్డ్ మైన్స్ శాటిలైట్ ఛానల్ లో హిందీ రంగస్థలం ప్రీమియర్ జరుపుకోనుంది. ఆగస్ట్ 24 ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రసారం చేయబోతున్నారు. విశేషం ఏంటంటే దీనికి నెలరోజుల ముందు నుంచే సదరు ఛానల్ ప్రమోషన్లు, ప్రోమోలు మొదలుపెట్టేయడం.
టిఆర్పి వర్గాల అంచనాల ప్రకారం రంగస్థలం హిందీ ప్రీమియర్ కు భారీ రేటింగ్స్ రావోచ్చట. గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయినప్పటికీ ఆర్ఆర్ఆర్ లో వచ్చిన రామరాజు ఇమేజ్ చరణ్ సినిమాకు పెద్ద ఎత్తున స్పందన తీసుకొస్తుందని గోల్డ్ మైన్స్ యాజమాన్యం భావిస్తోందట. ఒరిజినల్ తెలుగు వర్షన్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్నప్పటికీ హిందీ డబ్బింగ్ తో చూస్తే బాలీవుడ్ జనాలకు బాగా కనెక్ట్ అవుతుంది. అందుకే ఈ ఛాన్స్ వాడుకోవడానికి చూస్తున్నారు. అన్నట్టు ఆర్సి 17కి దర్శకుడు సుకుమారేనన్న సంగతి తెలిసిందే. ఈసారి రంగస్థలంను రెట్టింపు సినిమా ఆశిస్తున్నారు ఫ్యాన్స్.
This post was last modified on July 28, 2025 2:56 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…