ఈ ఏడాది ప్రథమార్ధంలో భారీ చిత్రాలు ఆశించిన స్థాయిలో లేక ఒకింత అసంతృప్తికి గురయ్యారు ప్రేక్షకులు. కానీ సెకండాఫ్‌లో పెద్ద సినిమాలు, క్రేజీ చిత్రాలు చాలానే షెడ్యూల్ అయ్యాయి. ఇటీవలే హరిహర వీరమల్లు రిలీజైంది. తర్వాత కింగ్‌డమ్ రాబోతోంది. వచ్చే నెలలో కూలీ, వార్-2 లాంటి క్రేజీ మూవీస్ ఒకేరోజు విడుదల కాబోతున్నాయి. ఆ తర్వాతి నెలలో మరో మెగా క్లాష్ చూడబోతున్నాం. దసరా వీకెండ్లో ఓజీ, అఖండ-2 చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ స్థాయి పెద్ద సినిమాలు ఒకే రోజు రిలీజవుతాయా.. వీటిలో ఒకటి పక్కకు తప్పుకుంటుందేమో అన్న చర్చ జరిగింది ఒక దశలో.
వాటి షూటింగ్ సమయానికి పూర్తయి, చెప్పిన డేట్‌కు వస్తాయా అనే సందేహాలు కూడా కలిగాయి. కానీ ఆ రెండు చిత్రాల మేకర్స్ పోటీకి సై అనే అంటున్నారు. సినిమాను ఆ సమయానికి రెడీ చేసే విషయంలోనూ ఇబ్బందులేమీ లేనట్లే. ఇప్పటికే ఓజీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. సెప్టెంబరు 25న ఓజీ రిలీజయ్యే విషయంలో ఎలాంటి సందేహాలూ లేవు. ఇక అఖండ-2 విషయానికి వస్తే… తాజాగా భద్రాచలం దగ్గర్లో ఈ సినిమా టాకీ పార్ట్ చివరి షెడ్యూల్ చేశారు.
అక్కడ చిత్రీకరణ పూర్తి చేసుకున్న అనంతరం భద్రాచలం రాములవారిని దర్శించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను.. మీడియాతో కూడా మాట్లాడారు. ఒక పాట మినహా చిత్రీకరణ అంతా పూర్తయినట్లు ఆయన వెల్లడించారు. సెప్టెంబరు 25న నందమూరి అభిమానులు అసలైన దసరా పండుగ చూస్తారంటూ ఆయన ఉత్సాహాన్ని నింపారు. ఆగస్టు సగానికల్లా ఈ సినిమా చిత్రీకరణ అంతా అయిపోతుందని.. ఆ తర్వాత విడుదలకు 40 రోజుల సమయం ఉంటుంది కాబట్టి.. పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లకు ఇబ్బందేమీ ఉండదని.. పాన్ ఇండియా స్థాయిలో భారీగా సినిమాను రిలీజ్ చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారని తెలుస్తోంది. దసరా పండక్కి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ చేసే స్కోప్ ఉంటుంది కాబట్టి.. టాలీవుడ్ బాక్సాఫీస్‌లో సందడి మామూలుగా ఉండదన్నట్లే.
This post was last modified on July 27, 2025 11:45 pm
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…