లక్ష్మి.. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీల్లో రిలీజైన ఇండియన్ సినిమాల్లో బిగ్గెస్ట్ అనదగ్గ చిత్రమిది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సినిమా అంటే ఇక దాని స్థాయేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంత భారీ చిత్రం ఓటీటీలో రిలీజవుతుందంటే ముందు చాలామంది నమ్మలేదు. కానీ ఆ తర్వాత ఆ సంగతే నిజమైంది. హాట్ స్టార్ సంస్థ భారీ మొత్తానికి హక్కులు కొని.. పెద్ద ఎత్తున సినిమాను ప్రమోట్ చేసి.. భారీ అంచనాల మధ్య దీపావళి కానుకగా ‘లక్ష్మి’ని స్ట్రీమ్ చేసింది.
ముందు ఉన్న అంచనాల వల్ల ఈ చిత్రానికి తొలి రోజు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ‘దిల్ బేచారా’ నెలకొల్పిన అత్యధిక డే-1 వ్యూస్ రికార్డును కొన్ని గంటల్లోనే ‘లక్ష్మి’ బద్దలు కొట్టేసింది. కానీ ఈ ఊపు తొలి రోజుకే పరిమితమైంది. ఇదొక చెత్త సినిమా అని ఇటు విమర్శకులు, అటు ప్రేక్షకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం.. చాలా దారుణమైన ఫీడ్ బ్యాక్ రావడంతో సినిమా తుస్సుమంది.
రెండో రోజు నుంచే ‘లక్ష్మి’ వార్తల్లో లేకుండా పోయింది. సినిమా చూసిన వాళ్లకు తలనొప్పి తప్పదన్న ప్రచారం గట్టిగా జరగడంతో జనాలు జడిసిపోయారు. సినిమాను మొదలుపెట్టినా పూర్తి చేయడం చాలా కష్టమైపోయింది. ఎటు చూసినా నెగెటివ్ వార్తలతో ‘లక్ష్మి’ డిజిటల్ మీడియంలో అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. తెలుగులో నిశ్శబ్దం లాంటి సినిమాల్ని టాక్‌తో సంబంధం లేకుండా చూసినట్లు ‘లక్ష్మి’ని చూడలేదని ట్రెండ్స్‌ను బట్టి స్పష్టంగా తెలుస్తోంది.
రెండు రోజుల తర్వాత ఈ సినిమాను అటు చిత్ర బృందం, ఇటు హాట్ స్టార్ వాళ్లు ప్రమోట్ చేయడం కూడా మానేశారు. ఈ సినిమా గురించి ట్వీట్లు వేసినా జనాలు బూతులు తిడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ వచ్చేవేమో కానీ.. తర్వాత నిలవడం కష్టమయ్యేది. బయ్యర్లకు నష్టాలు తప్పేవి కావు. ఈ రకంగా చూస్తే ఓటీటీ రిలీజ్ ద్వారా ‘లక్ష్మి’ మేకర్స్ సేఫ్ అయిపోయినట్లే.
This post was last modified on November 18, 2020 7:12 pm
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధా.. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న…
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…
మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…