ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్‌గా అవతరించినా.. చేస్తున్నవన్నీ భారీ చిత్రాలే అయినా.. మంచి స్పీడుతో సినిమాలు లాగిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. గత ఏడాది కల్కి చిత్రంతో పలకరించిన ప్రభాస్.. ఈ ఏడాది చివర్లో రాజా సాబ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం అతను హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రాలన్నింటికంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తున్నది స్పిరిట్ మీదే అనడంలో సందేహం లేదు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్.. ఇలా తీసిన మూడు చిత్రాలతోనూ ప్రకంపనలు రేపిన సందీప్ రెడ్డి వంగ.. ప్రభాస్‌తో ఎలాంటి సినిమా తీస్తాడు.. వీరి కాంబినేషన్ ఎలా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది అని క్యూరియాసిటీతో చూస్తున్నారు ఫ్యాన్స్.
అయితే సినిమా అనౌన్స్ అయి రెండేళ్లు దాటినా.. ఇంకా సెట్స్ మీదికి మాత్రం వెళ్లలేదు. షూటింగ్ ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. ఎంతకీ సినిమా మొదలు కావడం లేదు.
ఇలాంటి టైంలో స్వయంగా సందీప్ రెడ్డి స్పిరిట్ షూట్ గురించి అప్‌డేట్ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ కొత్త చిత్రం కింగ్‌డమ్ ప్రమోషన్లలో భాగంగా ఆ సినిమా హీరో, దర్శకుడితో కలిసి ఒక ప్రమోషనల్ వీడియోలో పాల్గొన్నాడు సందీప్. చిట్ చాట్ లాగా సాగిన ఈ వీడియోలో విజయ్.. స్పిరిట్ గురించి అడిగాడు.
ఆ సినిమా గురించి అడక్కపోతే సోషల్ మీడియాలో తనను తిట్టిపోస్తారని విజయ్ పేర్కొనగా.. ఏం పర్లేదు దాని గురించి ప్రశ్న అడగొచ్చని, అది అడగాల్సిన విషయమే అని సందీప్ పేర్కొన్నాడు. ఇంతకీ ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలుపెడుతున్నారు అని అడిగితే.. సెప్టెంబరు చివరి వారం నుంచి చిత్రీకరణ ఉంటుందని సమాధానమిచ్చాడు సందీప్. ఇక అప్పట్నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందా అని అడిగితే.. నాన్ స్టాప్‌గా కుమ్మేయడమే అంటూ నవ్వుతూ బదులిచ్చాడు సందీప్. సెప్టెంబరులో షూటింగ్ మొదలుపెట్టి నాన్ స్టాప్‌గా చిత్రీకరణ జరిపారంటే.. ఇంకో ఏడాదిలో సినిమా రిలీజైపోవచ్చు. అంటే 2026 చివర్లో స్పిరిట్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయన్నమాట.
This post was last modified on July 26, 2025 10:20 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…