పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత మూడు నెలల నుంచి గ్యాప్ లేకుండా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. తన పెండింగ్ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. ముందుగా ‘హరిహర వీరమల్లు’ను పూర్తి చేశారు. ఆ చిత్రం ఈ రోజు రిలీజైపోయింది కూడా. ‘ఓజీ’ షూట్‌ను కూడా పవన్ అవగొట్టేశాడు. పవన్‌తో సంబంధం లేని సన్నివేశాలను కూడా పూర్తి చేసి ఇటీవలే గుమ్మడికాయ కొట్టేసింది చిత్ర బృందం.
‘ఓజీ’ పని పూర్తి చేశాక ఆలస్యం చేయకుండా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్లోకి కూడా అడుగు పెట్టేశాడు పవన్. ఐతే పవన్ పెండింగ్ పెట్టిన ప్రాజెక్టుల్లో తక్కువ చిత్రీకరణ జరుపుకున్నది ఈ చిత్రమే కాబట్టి.. ఇది పూర్తి కావడానికి చాలా టైం పడుతుందేమో అనుకున్నారంతా. కానీ ఈ సినిమా షూట్, రిలీజ్ గురించి పవన్ ఇచ్చిన అప్‌డేట్ చూసి ఇప్పుడందరూ షాకైపోతున్నారు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’కు సంబంధించి తన పని ఇంకో ఐదారు రోజులు మాత్రమే మిగిలి ఉందని పవన్ చెప్పడం విశేషం. అంతే కాక ఈ చిత్రం డిసెంబరు లేదా జనవరిలో రిలీజవుతుందని కూడా ఆయన ప్రకటించారు. పవన్ ‘ఉస్తాద్’ సెట్లోకి అడుగు పెట్టింది గత నెలలోనే. ఐతే గ్యాప్ తీసుకోకుండా వరుసగా కాల్ షీట్స్ ఇవ్వడంతో దర్శకుడు హరీష్ శంకర్ చకచకా ఆయన మీద సీన్లు లాగించేస్తున్నట్లున్నాడు.
హరీష్ మామూలుగానే స్పీడ్ అన్న సంగతి తెలిసిందే. పైగా పవన్‌కు ఉన్న బిజీ షెడ్యూల్ దృష్ట్యా ఆయన దొరికినపుడు ఇంకా వేగం చూపించాలి. ఎప్పుడో స్క్రిప్టు రెడీ చేసి పెట్టుకోవడం, పక్కాగా షెడ్యూళ్లు ప్లాన్ చేయడంతో షూటింగ్ శరవేగంగా జరిగిపోతున్నట్లుంది. పవన్ మీద సన్నివేశాలు అవగొట్టేశారంటే.. సినిమాను పూర్తి చేయడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. ‘హరిహర వీరమల్లు’ వచ్చిన రెండు నెలలకే ‘ఓజీ’ రానుండగా.. ఆ తర్వాత మూణ్నాలుగు నెలలకే ‘ఉస్తాద్’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుందన్నమాట.
This post was last modified on July 24, 2025 5:02 pm
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్‌కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…