ఇవాళ విడుదలైన హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ కు బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ దక్కాయి. టాక్ కొంత మిశ్రమంగా ఉండటం ఫ్యాన్స్ లో ఆందోళన కలిగిస్తున్న మాట వాస్తవం. అయితే మొదటి రోజు రిపోర్ట్స్ తో సంబంధం లేకుండా హిట్టయిన సినిమాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇది కూడా అదే కోవలోకి వస్తుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. అధిక శాతం ఆడియన్స్, రివ్యూలలో వినిపించిన కంప్లయింట్ విఎఫ్ఎక్స్. సెకండాఫ్ లో వచ్చే చాలా కీలకమైన ఎపిసోడ్స్ కు గ్రాఫిక్స్ వర్క్ ఆశించిన స్థాయిలో అనిపించలేదు. కొన్ని చోట్ల దొరికిపోయేలా విజువల్ ఎఫెక్ట్స్ డిజైన్ చేశారు.
తాజా అప్డేట్ ఏంటంటే ఇప్పుడా ప్రింట్స్ లో కీలక మార్పులతో కొత్త వెర్షన్ ఇవాళ సాయంత్రం లేదా రేపు ఎల్లుండి నుంచి థియేటర్లలో స్క్రీనింగ్ అవుతుందట. విఎఫ్ఎక్స్ కంపెనీతో జరిగిన వ్యవహారాల్లో ఆలస్యం జరగడం వల్ల కొంత భాగం రాజీపడాల్సి వచ్చిందని, ఇప్పుడవన్నీ తీరిపోవడంతో మళ్ళీ శాటిలైట్ లో అప్లోడ్స్ చేస్తున్నారని వినికిడి. ఇది నిజమని చెప్పేందుకు అధికారిక సమాచారం లేదు కానీ ఇన్ సైడ్ టాక్ అయితే నమ్మదగినదిగానే ఉంది. ఒకవేళ ఆలా జరిగితే గ్రాఫిక్స్ లో క్వాలిటీ పెరిగి బయటికి మరింత మెరుగైన టాక్ వచ్చే అవకాశముంది. ఇవాళ సక్సెస్ ప్రెస్ మీట్ లో ఏమైనా చెబుతారేమో చూడాలి.
టాక్స్, రెవిన్యూస్ కాసేపు పక్కనపెడితే హరిహర వీరమల్లు ఫస్ట్ డే ఓపెనింగ్స్ కొత్త రికార్డులు నెలకొల్పేలా ఉన్నాయి. మొదటి రోజే పవన్ కళ్యాణ్ సినిమా చూసే తీరాలన్న ఫ్యాన్స్ కోరిక బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిపిస్తోంది. పుష్ప 2 స్థాయిలో బజ్ లేకపోయినా అంతకు మించి ప్రీమియర్ షోల నెంబర్లు వీరమల్లుకి వచ్చాయని ట్రేడ్ టాక్. ఇంకా అఫీషియల్ నెంబర్లు రావాల్సి ఉంది. విడుదలైన ప్రతిచోట సందడి వాతావరణం నెలకొంది. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కాస్త భిన్నమైన సీన్ కనిపిస్తున్నప్పటికీ ఇంకో వారం రోజులు ఆగితే వీరమల్లు రేంజ్ ఏంటనేది బయట పడుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates