ఫిలిం సెలబ్రెటీల విడాకులు ఈ మధ్య మామూలు వార్తలైపోయాయి. పెళ్లయిన కొన్నేళ్లకే సెలబ్రెటీ జంటలు విడిపోతున్న విషయం తెలిసి ఫ్యాన్స్ ఫీలవుతున్నారు కానీ.. తర్వాత ఇది మామూలే కదా అని సర్దుకుపోతున్నారు. గత కొన్నేళ్లలో వివిధ ఇండస్ట్రీలకు చెందిన పదుల సంఖ్యలో జంటలు విడిపోయాయి. ఇప్పుడు ఒకప్పటి స్టార్ హీరోయిన్ హన్సిక విడాకుల గురించి వార్తలు మొదలయ్యాయి. ఆమె సోహైల్ కటూరియా అనే తన స్నేహితుడిని పెళ్లి చేసుకుని మూడేళ్లు కూడా కాలేదు. చాలా గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవడమే కాదు.. ఆ తతంగాన్నంతా డాక్యుమెంటరీగా చిత్రీకరించి ఒక ఓటీటీ సంస్థకు ఇచ్చింది ఈ జంట.
ఐతే రెండేళ్లకే వీళ్లిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని.. కొన్ని నెలలుగా హన్సిక భర్తకు దూరంగా.. తల్లితో కలిసి విడిగా ఉంటోందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. సోహైల్‌ది ఉమ్మడి కుటుంబం అని.. అక్కడ హన్సిక ఇమడలేకపోయిందని.. అందుకే భర్తకు దూరంగా తల్లితో కలిసి ఉంటోందని వార్తలు వస్తున్నాయి. హన్సిక, సోహైల్ విడాకులు కూడా తీసుకోబోతున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. ఐతే మీడియా వాళ్లు ఈ విషయమై హన్సికను వివరణ కోరే ప్రయత్నం చేయగా.. ఆమె అందుబాటులోకి రాలేదు. కానీ సోహైల్ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించాడు. తమ మధ్య అంతా బాగుందని తెలిపాడు. కానీ హన్సిక ఈ విషయాన్ని ధ్రువీకరించకపోవడంతో విడాకుల వార్తలు నిజమే అనుకుంటున్నారు జనం.
హన్సిక పెళ్లి విషయంలో ఒక ట్విస్ట్ ఉంది. ఆమె పెళ్లాడింది తన ఫ్రెండ్ భర్తను కావడం గమనార్హం. సోహైల్ మొదటి భార్య.. హన్సికకు క్లోజ్ ఫ్రెండ్. సోహైల్ ఏమో హన్సిక సోదరుడికి స్నేహితుడు. మరి తన తొలి వివాహంలో ఏం సమస్యలు వచ్చాయో ఏమో.. భార్య నుంచి విడిపోయి హన్సికతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. కానీ మూడేళ్లు తిరక్కుండానే వీళ్లిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం మొదలైంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలి.
This post was last modified on July 22, 2025 3:33 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…