జూలై 31 విడుదల కాబోతున్న కింగ్డమ్ ప్రమోషన్లు ఇంకో రెండు రోజుల్లో ఊపందుకోబోతున్నాయి. ఇంటా బయట హరిహర వీరమల్లు సందడి ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం సితార సంస్థ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. నిర్మాత నాగవంశీ ఇస్తున్న ఇంటర్వ్యూలు ఎప్పటిలాగే సోషల్ మీడియాలో వైరల్ కాగా ఈ వీకెండ్ నుంచి విజయ్ దేవరకొండతో పాటు ఇతర టీమ్ సభ్యులు రంగంలోకి దిగబోతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనిరుధ్ రవిచందర్ లైవ్ కన్సర్ట్ చేయడం ద్వారా హైప్ ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే ప్లాన్ లో సితార టీమ్ ఉంది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఫైనల్ టచప్స్ లో బిజీగా ఉన్నారు.
అందరూ అనుకుంటున్నట్టు ఇది కేవలం శ్రీలంక శరణార్ధుల బ్యాక్ డ్రాప్ లో జరిగే సీరియస్ కథ మాత్రమే కాదట. అంతకు మించిన బ్రదర్ సెంటిమెంట్ బలంగా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. ఇటీవలే రిలీజ్ చేసిన లిరికల్ వీడియోలో సత్యదేవ్, విజయ్ దేవరకొండల మధ్య బాండింగ్ చూపించిన గౌతమ్ తిన్ననూరి అసలు సినిమాలో ఈ ట్రాక్ ని నెక్స్ట్ లెవెల్ లో తీశారట. పోలీస్ గా ఉన్న ఒక యువకుడు అన్నకు జరిగిన అన్యాయానికి తిరుగుబాటుదారుడిగా మారి, బలహీన వర్గాలకు ఎలా నాయకుడయ్యాడనే పాయింట్ మీద కింగ్డమ్ ఆద్యంతం హై వోల్టేజ్ లో నడుస్తుందని ఇన్ సైడ్ టాక్.
ఎమోషనల్ గా ఆడియన్స్ కి పీక్స్ కి తీసుకెళ్లే ఎపిసోడ్ కూడా సత్యదేవ్ తోనే ముడిపడి ఉంటుందని వినికిడి. ఫ్యామిలి ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేది ఇదే అంటున్నారు. తనకు జెర్సీలో బాగా వర్కౌట్ అయిన భావోద్వేగాలను ఈసారి అన్నదమ్ముల మధ్య పెట్టడం ద్వారా గౌతమ్ తిన్ననూరి కొత్త ఎక్స్ పరిమెంట్ చేశారని అంటున్నారు. వరస ఫ్లాపుల తర్వాత తన మీద ఇంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందని ఋజువు చేసుకుంటేనే విజయ్ దేవరకొండ తర్వాత సినిమాలకు సరిపడా బజ్ వస్తుంది. అందుకే కింగ్డమ్ కోసం ఒంటిని మనసుని చాలా కష్టపెట్టుకున్నాడు. ఫలితం ఇంకో ఎనిమిది రోజుల్లో తేలనుంది.
This post was last modified on July 22, 2025 1:07 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…