జూలై 31 విడుదల కానున్న కింగ్డమ్ బడ్జెట్ పరంగా చాలా పెద్ద ఒత్తిడిని ఎదురుకుంది. విజయ్ దేవరకొండ మార్కెట్ ని మించి వంద కోట్ల దాకా ఖర్చు పెట్టడం థియేట్రికల్ గా రిస్క్ అయ్యింది. ఎందుకంటే బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఓకే. లేదంటే లెక్కలు ప్రమాదంలో పడతాయి. కానీ అలాంటి టెన్షన్ లేకుండా ఓటిటి డీల్ యాభై కోట్లకు క్లోజ్ అయ్యిందని లేటెస్ట్ అప్డేట్. హక్కులు కొన్న నెట్ ఫ్లిక్స్ నాలుగు వారాల విండో కింద ఇంత మొత్తానికి అంగీకారం తెలిపినట్టు వినికిడి. ఇది ఎప్పుడో జరిగిన ఒప్పందమే అయినా తాజాగా వచ్చిన లీక్స్ ప్రకారం చూసుకుంటే రౌడీ బాయ్ మార్కెట్ కు ఇది పెద్ద మొత్తమనే చెప్పాలి.
కింగ్డమ్ కు ఇంత క్రేజ్ రావడం వెనుక కారణాలున్నాయి. ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు. పీరియాడిక్ సెటప్ లో శ్రీలంక శరణార్ధుల బ్యాక్ డ్రాప్ ని తీసుకుని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చాలా ఇంటెన్స్ గా తెరకెక్కించాడు. పైకి యాక్షన్ డ్రామాలా కనిపిస్తున్నా బలమైన బ్రదర్ సెంటిమెంట్ టచ్ చేసేలా ఉంటుందని యూనిట్ వర్గాల మాట. దీనికి తోడు అనిరుద్ రవిచందర్ సంగీతం రక్షణ కవచంలా నిలబడి యూత్ లో క్రేజ్ పెంచుతోంది. ఏ స్థాయి మ్యూజిక్ ఇచ్చాడనేది థియేటర్లలో తెలుస్తుంది కానీ సినిమా మీద బజ్ పెరిగేందుకు తన పేరు బయట రాష్ట్రాల్లో ట్రంప్ కార్డు అయ్యిందనేది వాస్తవం.
ఇక మిగిలిన యాభై కోట్లను కింగ్డమ్ థియేటర్ల నుంచి వసూలు చేయాల్సి ఉంటుంది. కాకపోతే రెండు వారాల్లో ఆ టార్గెట్ పూర్తి చేయాలి. ఎందుకంటే కింగ్డమ్ వచ్చిన సరిగ్గా పధ్నాలుగు రోజులకు కూలి, వార్ 2 లు బాక్సాఫీస్ మీద అటాక్ చేస్తాయి. అప్పటికంతా విజయ్ దేవరకొండ తన లక్ష్యాన్ని చేరుకుంటే రిలాక్స్ అవ్వొచ్చు. హిట్ టాక్ వస్తే మొదటి వీకెండ్ కే వంద కోట్లు సాధ్యమని సంక్రాంతికి వస్తున్నాం, సరిపోదా శనివారం, హిట్ 3 ది థర్డ్ కేస్ లాంటివి నిరూపించాయి. సో కింగ్డమ్ కు ఈ టాస్క్ అసాధ్యం కాకపోవచ్చు, టైటిల్ మార్చి హిందీ వెర్షన్ సైతం జూలై 31న సమాంతరంగా రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతోంది.
This post was last modified on July 16, 2025 5:44 pm
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…