తారక్ ఇంట్రోకి స్క్రీన్లు చిరిగిపోతాయి

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న క్రేజీ మల్టీస్టారర్ వార్ 2  విడుదల ఇంకో ఇరవై తొమ్మిది రోజుల్లో ముంచుకొస్తోంది. టీజర్ తప్ప ఇప్పటిదాకా ప్రమోషన్స్ పరంగా యష్ రాజ్ ఫిలిమ్స్ దూకుడు చూపించనప్పటికీ ఆగస్ట్ మొదటి వారం నుంచి అవి నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని ముంబై రిపోర్ట్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న తారక్ త్వరలోనే బ్రేక్ తీసుకుని వార్ 2 పబ్లిసిటీలో భాగం కాబోతున్నాడు. ముంబై నుంచి హైదరాబాద్ దాకా ప్లాన్ చేయబోయే ఈవెంట్స్, ట్రైలర్ లాంచ్ తో ఒక్కసారిగా అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోతాయని టీమ్ ఊరిస్తోంది.

తెలుగు రాష్ట్రాల హక్కులు కొన్న నిర్మాత నాగవంశీ చెబుతున్న మాటలు అభిమానులకు ఓ రేంజ్ లో గూస్ బంప్స్ ఇచ్చేలా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రోకి తెరలు చిరిగిపోతాయని, అంత గొప్పగా వచ్చిందని, ఇప్పుడే చెప్పడం భావ్యం కాదు కానీ ఒక బిగ్ ఎక్స్ పీరియన్స్ పొందబోతున్నారని మా ప్రతినిధికిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతే కాదు ఇద్దరు ఫైనెస్ట్ స్టార్స్ తెరమీద కొట్టుకుంటూ ఉంటే చూసేందుకు రెండు కళ్ళు చాలవని, రైట్స్ కొనేందుకు ఇంతకన్నా యాంటిసిపేటేషన్ ఇంకేం కావాలని చెప్పడం చూస్తే వార్ 2 యాక్షన్ సీక్వెన్సులు ఓ రేంజ్ లో ఉంటాయని అర్థమవుతోంది.

కింగ్డమ్ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతున్న నాగవంశీ పనిలో పని వార్ 2 కబుర్లు కూడా పంచుకుంటున్నారు. రజనీకాంత్ కూలితో తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఓపెనింగ్స్ పంచుకోవాల్సి వస్తుందనే దాని మీద తారక్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల సంగతి పక్కనపెడితే కూలి ప్రభావం తమిళనాడు, కేరళలో తీవ్రంగా ఉంటుంది. కర్ణాటకలోనూ ఎఫెక్ట్ చూపిస్తుంది. బజ్ పరంగా కూలి కన్నా వార్ 2 కొంత వెనుకబడినప్పటికీ పాటలు, ట్రైలర్ వదిలాక ఈ లెక్కలను మార్చొచ్చు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన వార్ 2లో హృతిక్, తారక్ మధ్య వచ్చే సీక్వెన్సులే మెయిన్ హైలైట్ గా చెబుతున్నారు.