గత కొద్దిరోజులుగా ఓజి సెప్టెంబర్ 25 నుంచి తప్పుకుని వాయిదా పడుతుందనే వార్త జోరుగానే తిరుగుతోంది. డివివి ఎంటర్ టైన్మెంట్స్ అదేమీ లేదని సోషల్ మీడియా వేదికగా క్రమం తప్పకుండా అప్డేట్స్ ఇస్తూ క్లారిటీ ఇస్తోంది. నిన్న కొత్త పవన్ కళ్యాణ్ పోస్టర్ తో మరోసారి రిలీజ్ డేట్ ని ధృవీకరించడంతో ఫ్యాన్స్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇంకో పన్నెండు రోజుల్లో విడుదల కాబోతున్న హరిహర వీరమల్లు కన్నా నిన్న సాయంత్రం నుంచి ఓజి ట్రెండింగ్ లోకి రావడం గమనించాల్సిన విషయం. పైగా ఓజి తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులకు సంబంధించిన నెంబర్లు బయటికి రావడం మరో ట్విస్ట్.
ఓజి ఇంత కాన్ఫిడెంట్ గా ఉండటానికి పలు కారణాలున్నాయి. మొదటిది ప్రాజెక్టు మీద నెలకొన్న హైప్. అనౌన్స్ మెంట్ నుంచి మొదలుపెట్టి టీజర్ దాకా ప్రతిదశలో అంచనాలు అంతకంతా పెరుగుతున్నాయి తప్ప కించిత్ కూడా తగ్గడం లేదు. ఏరియాల వారీగా డిస్ట్రిబ్యూటర్లు ముందు నుంచే విపరీతమైన ఆఫర్లతో నిర్మాతను ఉక్కిరిబిక్కిరి చేస్తూ వచ్చారు. ఒకవేళ అఖండ 2 పోటీలో ఉన్నా కూడా ఓజి టెన్షన్ పడాల్సింది ఏమి లేదనేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ధీమా. బాలయ్య సినిమా మీద కూడా హైప్ ఇదే స్థాయిలో ఉంది కానీ స్పష్టంగా ఎవరిది పై చేయి అంటే మాత్రం ఓజి అనే సమాధానమే చెప్పాల్సి ఉంటుంది.
ఇక విశ్వంభర సెప్టెంబర్ 18 వస్తుందనే ప్రచారం గురించి సరైన స్పష్టత లేకపోవడం చూస్తే ఓజి సంభవంలో ఎలాంటి పోస్ట్ పోన్ లేనట్టే కనిపిస్తోంది. దర్శకుడు సుజిత్ మీద ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకం అంతా ఇంతా కాదు. ముంబై గ్యాంగ్ స్టర్ గా పవర్ స్టార్ ని ఓ రేంజ్ లో చూపిస్తాడనే ధీమాలో వాళ్ళున్నారు. కంటెంట్ కనక నిజంగా ఆ స్థాయిలో ఉంటే కెజిఎఫ్ రేంజ్ లో రికార్డులు ఆశించవచ్చు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఓజి ద్వారా ఇమ్రాన్ హష్మీ మనకు విలన్ గా పరిచయమవుతున్నాడు. తమన్ ఇచ్చే పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ఫ్యాన్స్ మధ్య ఎంత చర్చ జరుగుతుందో మళ్ళీ చెప్పాల్సిన పని లేదు.
This post was last modified on July 12, 2025 11:30 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…