Movie News

తండ్రి బాటలోనే నాగ చైతన్యా..?

ఫ్లాపుల పరంపరకు తెరదించుతూ ‘తండేల్’ మూవీతో ఉపశమనాన్ని అందుకున్నాడు అక్కినేని నాగచైతన్య. ఈ సినిమా గురించి రిలీజ్ ముంగిట టీం చెప్పిన స్థాయిలో అద్భుతాలు జరిగిపోకున్నా.. ఉన్నంతలో మంచి ఫలితాన్నే అందుకుంది. దీంతో హమ్మయ్య అనుకున్న చైతూ.. తన తర్వాతి చిత్రానికి ఉత్సాహంగా సిద్ధమయ్యాడు. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో చైతూ.. ఒక భారీ మిస్టిక్ థ్రిల్లర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ మధ్యలో ఉంది. 

దీని తర్వాత చైతూ నటించే సినిమా గురించి ఇప్పుడు ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. అతను ఓ తమిళ దర్శకుడితో జట్టు కట్టబోతున్నట్లు సమాచారం. అతనే.. పి.ఎస్.మిత్రన్. తమిళంలో థ్రిల్లర్ చిత్రాలకు పేరుపడ్డాడు మిత్రన్. ఇప్పటిదాకా అతను తీసినవన్నీ థ్రిల్లర్ సినిమాలే. విశాల్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇరింబు తిరై’ (తెలుగులో అభిమన్యుడు) చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు మిత్రన్. ఆ తర్వాత శివ కార్తికేయన్‌తో తీసిన ‘శక్తి’ సినిమా కూడా హిట్ అయింది. ఆపై కార్తితో అతను చేసిన ‘సర్దార్’ ఇంకా పెద్ద హిట్ అయింది. ప్రస్తుతం మిత్రన్.. కార్తితోనే ‘సర్దార్-2’ చేస్తున్నాడు. దీపావళికి ఆ సినిమా రిలీజ్ కాబోతోంది. 

మిత్రన్ తెలుగులో సినిమా చేస్తాడని ఇంతకుముందే వార్తలు వచ్చాయి. ఇప్పుడు చైతూతో అతను సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. తన శైలికి తగ్గట్లే థ్రిల్లర్ కథను చేయాలని అనుకుంటున్నాడట. అది పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే అవకాశాలున్నాయి. ప్రస్తుతం చైతూ తండ్రి నాగార్జున సైతం రా.కార్తీక్ అనే తమిళ దర్శకుడితో సినిమాకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. త్వరలోనే ఆ సినిమా మొదలు కాబోతోంది. తండ్రి బాటలో చైతూ సైతం తమిళ దర్శకుడితోనే జట్టు కట్టబోతుండడం విశేషమే. త్వరలోనే ఆ సినిమా గురించి అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. ఐతే గత కొన్నేళ్లలో తెలుగు హీరోలతో తమిళ దర్శకులు చేసిన సినిమాలేవీ సరిగా ఆడని విషయం గమనార్హం.

This post was last modified on July 11, 2025 2:50 pm

Share

Recent Posts

పెంచి పోషించిన గ్రోకే దెబ్బేసిందిగా మస్క్

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…

44 minutes ago

పెళ్లి పేరుతో బిగ్ బాస్ విన్నర్ మోసం?

తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…

49 minutes ago

జైలర్ 2 ఋజువు చేయాల్సినవి ఎన్నో

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…

55 minutes ago

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

4 hours ago

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

4 hours ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

5 hours ago