హరిహర వీరమల్లు విడుదల ముంచుకు వస్తోంది. సరిగ్గా ఇంకో రెండు వారాల్లో పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీదకు రాబోతున్నాడు. ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ సంగతేమో కానీ ప్రమోషన్ల పరంగా ఇంకాస్త స్పీడ్ పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది. అభిమానుల అంచనాలు ఎలా ఉన్నా కామన్ పబ్లిక్ కి దీన్ని మరింత చేరువ చేయాలి. ఎంత పవర్ స్టార్ మూవీ అయినా సరే పబ్లిసిటీని మరీ తేలిగ్గా తీసుకోవడానికి లేదు. పెంచిన టికెట్ రేట్లతో మొదటి వారం రోజులు థియేటర్లు హౌస్ ఫుల్ కావాలంటే ఫ్యాన్స్ సరిపోరు. సాధారణ ప్రేక్షకుల మద్దతు అవసరం. అందులోనూ ఆలస్యం వల్ల హైప్ తగ్గిపోయిన టైంలో ఇది చాలా కీలకం.
బిజినెస్ వ్యవహారాలు, థియేటర్ల పంచాయితీలు, ఇంటర్వ్యూలు గట్రా వ్యవహారాలతో బిజీగా ఉన్న నిర్మాత ఏఎం రత్నం ఫలితం మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. రీ రికార్డింగ్ ఇంకా పూర్తయ్యిందో లేదో క్లారిటీ లేదు. కీరవాణి తండ్రి శివశక్తిదత్తా అనారోగ్యంతో కన్ను మూయడంతో ఎంత లేదన్నా రెండు మూడు రోజులు బ్రేక్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒకరకంగా ఒత్తిడి పెంచేదే. ఒకటి మినహాయించి పాటలు మరీ అద్భుతం చేయకపోవడంతో ఇప్పుడు ఆశలన్నీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీదే ఉన్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ రేంజ్ లో ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అలా అయితేనే ఎలివేషన్లు పండుతాయి.
బాక్సాఫీస్ దగ్గర చాలా గ్యాప్ ఉంది. కుబేర తర్వాత ఏ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. కన్నప్ప కూడా ఫైనల్ గా చేతులు ఎత్తేసింది. తమ్ముడు గురించి చెప్పాల్సిన పని లేదు. ఓ భామ అయ్యో రామా, 100 లాంటివి ఏదో వండర్స్ చేస్తాయనే నమ్మకం లేదు కానీ డీసెంట్ టాక్ వచ్చినా చాలు ఎంతో కొంత ఫీడింగ్ కు ఉపయోగపడతాయి. ముఖ్యంగా సుహాస్ సినిమాకు టాక్ బాగుంటే వారం పది రోజులు నెట్టుకొస్తాడు. ఆరు నెలల తర్వాత వస్తున్న టయర్1 హీరో సినిమా కావడంతో హరిహర వీరమల్లు మీద డిస్ట్రిబ్యూటర్లు పెద్ద పందేలు కాస్తున్నారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే రికార్డుల వర్షమే. చూడాలి మరి ఏం చేస్తుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates