మన ఇంటి బంగారం మంచిదైతే పక్కింటి మీద ఎందుకు మనసు పడతామని పెద్దలు ఊరికే అనలేదు. తెలుగు హిందీ సినిమాలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవడంతో ఆడియన్స్ హాలీవుడ్ మూవీస్ ని నెత్తిన బెట్టుకుంటున్నారు. గత రెండు వారాలుగా ఇదే తంతు జరుగుతోంది. ముందు ‘ఎఫ్1’కి బ్రహ్మరథం దక్కింది. ముఖ్యంగా ఏ సెంటర్స్ లో యూత్, క్లాస్ ప్రేక్షకులు హౌస్ ఫుల్స్ చేసి మరీ చూశారు. హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ బిగ్ స్క్రీన్ లో ఈ ఒక్క దానికే 25 వేల టికెట్లు అమ్ముడుపోవడమంటే మాటలు కాదు. రెండో వారంలోనూ చాలా చోట్ల షోలను స్టడీగా కొనసాగించడం ప్రధాన విశేషంగా చెప్పుకోవచ్చు.
తర్వాత వారం రిలీజైన ‘జురాసిక్ వరల్డ్ రీ బర్త్’ కు నిజానికి నెగటివ్ రివ్యూలు ఎక్కువగా వచ్చాయి. అదే పాత డైనోసార్ల కథను తిప్పి తిప్పి చూపించారని విమర్శకులు గట్టిగానే తలంటారు. కట్ చేస్తే వీకెండ్ లో ఎక్కువ కలెక్షన్లు వచ్చిన సినిమా ఇదే. తెలుగు డబ్బింగ్ తో పాటు 3డి వెర్షన్ ని అందుబాటులోకి తేవడంతో పిల్లలు పెద్దలు ఎగబడ్డారు. నెక్స్ట్ వీక్ ‘సూపర్ మ్యాన్’ వస్తున్నాడు. టాలీవుడ్ స్ట్రెయిట్ రిలీజులు ఓ భామ అయ్యో రామా, 100, వర్జిన్ బాయ్స్ కు ఏమంత బజ్ లేకపోవడంతో సూపర్ మ్యాన్ అడ్వాన్స్ బుకింగ్సే మెరుగ్గా ఉన్నాయి. టాక్ యావరేజ్ వచ్చినా చాలు గాల్లో ఎగిరే సూపర్ హీరో వసూళ్లు కొల్లగొట్టేస్తాడు.
దీనికి కారణం సింపుల్. తమ్ముడు, కన్నప్ప లాంటి పెద్ద సినిమాలు అంచనాలు అందుకోలేకపోవడం, కుబేర పది రోజుల తర్వాత స్లో అయిపోవడం. ఘాటీ వాయిదా పడకుండా అనుకున్న టైంకే వచ్చి ఉంటే పరిస్థితి ఇంకాస్త మెరుగ్గా ఉండేది. కానీ వెనక్కు తగ్గింది. హరిహర వీరమల్లు సైతం పోస్ట్ పోన్లు చేసుకుంటూ వచ్చి జూలై 24కి ఫిక్స్ అయ్యింది. అప్పటిదాకా థియేటర్ ఆక్యుపెన్సీలు ఇలాగే కొనసాగబోతున్నాయి. ఒకప్పుడు లక్ష్మి గణపతి ఫిలిమ్స్ ఇంగ్లీష్ అనువాదాలు రిలీజ్ చేసినప్పుడు మంచి కలెక్షన్లు వచ్చేవి. ఇప్పుడు అదే సీన్ రిపీటవుతోంది. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో వీటి సందడి మాములుగా లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates