అక్కినేని నాగార్జున కెరీర్లో చివరి బ్లాక్ బస్టర్ అంటే ‘సోగ్గాడే చిన్నినాయనా’నే. ఇందులో నటించిన మిగతా వాళ్ల కెరీర్లలోనూ ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోయేదే. నాగ్ సరసన కథానాయికగా నటించిన లావణ్య త్రిపాఠికి కూడా కెరీర్లో ఇదే పెద్ద హిట్. ఈ సినిమాలో ఆమె అందం, అభినయం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కానీ ఈ సినిమాలో ఆమె అయిష్టంగానే చేసిందట. ఈ సినిమాకు తనను అడిగినపుడు చాలామంది నెగెటివ్‌గానే మాట్లాడినట్లు లావణ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
నాగ్ లాంటి సీనియర్ హీరో సరసన నటిస్తే ఓ ముద్ర పడిపోతుందని.. తర్వాత వరుసగా అలాంటి సినిమాలే వస్తాయని అన్నారట. దీంతో తాను అయిష్టంగానే ఈ సినిమాకు సంతకం చేసినట్లు లావణ్య తెలిపింది. ఇదే విషయాన్ని తాను నాగార్జునకు కూడా చెప్పానని.. ఆయన ఈ విషయాన్ని తేలిగ్గా కొట్టి పారేసి.. తనకెన్నో మంచి విషయాలు చెప్పారని, తన కెరీర్ విషయంలో చక్కటి గైడెన్స్ ఇచ్చారని.. ఇప్పటికీ కెరీర్ విషయంలో ఏమైనా సలహాలు కావాలంటే తాను నాగార్జుననే అడుగుతానని లావణ్య తెలిపింది.
ఇక తన పాత్రల విషయంలో వచ్చిన విమర్శల గురించి లావణ్య మాట్లాడుతూ.. ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలో తన మేకప్ ఏమాత్రం బాగా లేదన్న విమర్శలు చాలా విన్నానని, తనకు కూడా అది నిజమే అనిపించిందని.. దీంతో అప్పటి నుంచి జాగ్రత్త పడుతున్నానని అంది. ‘అర్జున్ సురవరం’ కంటే ముందు వరుసగా ఫ్లాపులు ఎదుర్కోవడంపై మాట్లాడుతూ.. వాటికి తనదే బాధ్యత అంది. కొన్ని పాత్రలు బాగా లేకున్నా వేరే కారణాల వల్ల ఒప్పుకోవాల్సి వచ్చిందని ఆమె అంది. ప్రస్తుతం ‘ఎ1 ఎక్స్‌ప్రెస్ సినిమాలో హాకీ క్రీడాకారిణిగా చాలా మంచి పాత్ర చేస్తున్నానని.. దీంతో పాటు తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నానని లావణ్య వెల్లడించింది.
This post was last modified on May 1, 2020 1:27 am
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…