విజయ్ దేవరకొండ బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా మూవీ కింగ్ డమ్ విడుదలకు రంగం సిద్ధమైపోయింది. అధికారిక ప్రకటన సోమవారం రానుంది. విశ్వసనీయ సమాచారం మేరకు జూలై 31 లాక్ చేసుకున్నట్టు తెలిసింది. తొలుత జూలై 25 ప్రచారం జరిగింది కానీ దానికన్నా ఒక రోజు ముందు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఉండగా కింగ్ డమ్ ని దించడం సితార సంస్థకు ఇష్టం లేదు. దీంతో రెండు మూడు దఫాల చర్చల తర్వాత కొత్త డేట్ కి ఓటిటి కంపెనీని ఒప్పించినట్టుగా తెలిసింది. రౌడీ బాయ్ ఫ్యాన్స్ కోరుకున్న ఘడియ అయితే వచ్చేస్తోంది. కాకపోతే బాక్సాఫీస్ రన్ కు సంబంధించి గమనించాల్సిన విషయం ఒకటుంది.
ఆగస్ట్ 14 ఒకే రోజు కూలీ, వార్ 2 రిలీజ్ కాబోతున్నాయి. కింగ్ డమ్ వచ్చిన రెండు వారాలకే రెండు ప్యాన్ ఇండియా మూవీస్ థియేటర్లకు వచ్చేస్తాయి. అంటే థియేటర్లలో అత్యధిక శాతం వాటికే కేటాయించాల్సి ఉంటుంది. అయితే కింగ్ డమ్ నిర్మాత నాగ వంశీనే వార్ 2కి తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్. సో ఒకవేళ విజయ్ మూవీ సూపర్ హిట్ అయ్యి స్క్రీన్లు కొనసాగించాల్సి వస్తే అడ్జస్ట్ మెంట్ చేయడం ఇబ్బంది కాకపోవచ్చు. కూలిని పంపిణి చేస్తున్న ఏషియన్ కు సంబంధించిన థియేటర్లను కింగ్ డమ్ కి కొనసాగించలేరు. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో కింగ్ డమ్ కు రెండు వారాల రన్ సరిపోతుంది.
కుబేర వంద కోట్ల గ్రాస్ దాటింది మొదటి వారంలోనే. హిట్ 3 ది థర్డ్ కేస్, తండేల్ సైతం పది రోజుల్లోపే ఆ ల్యాండ్ మార్క్ ని చేరుకున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం అంతకన్నా వేగంగా ఆ మైలురాయి అందుకుంది. సో కింగ్ డమ్ బ్లాక్ బస్టర్ తెచ్చుకుంటే టెన్షన్ ఉండదు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో శ్రీలంక శరణార్ధుల బ్యాక్ డ్రాప్ తీసుకున్నారు. అణుగారిన వర్గాలను కాపాడే నాయకుడిగా విజయ్ దేవరకొండ చాలా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఫ్లాపుల ప్రవాహంలో ఉన్న తనను ఈ సినిమానే తిరిగి ఫామ్ లోకి తెస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. వచ్చే వారం నుంచి పబ్లిసిటీ పెంచుతారు.
This post was last modified on July 5, 2025 10:01 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…