ఇటీవలే 8 వసంతాలతో ప్రేక్షకులను పలకరించిన దర్శకుడు నరేంద్ర ఫనిశెట్టి కంటెంట్ కన్నా ఎక్కువగా స్పీచులతో హాట్ టాపిక్ అయ్యాడు. తగ్ లైఫ్ గురించి మణిరత్నంని సమర్ధించే ప్రయత్నంలో ఆడియన్స్ మీద చేసిన కామెంట్స్ మిస్ ఫైర్ అయ్యాయి. పది నిముషాలు పెన్ను పక్కన పెడితే నేను సృష్టించే మాస్ విధ్వంసం ఎలా ఉంటుందో వారణాసి ఎపిసోడ్ లో చూడమని ఇంకో ఎలివేషన్ ఇచ్చాడు. తీరా చూస్తే హీరోయిన్ ఫైట్ చేయడం తప్ప మరే ప్రత్యేకత కనిపించలేదు. ఈ బ్లాక్ గురించి ఒక మీడియా ప్రతినిధి అభ్యంతరం వ్యక్తం చేయడం, దాని గురించి సోషల్ మీడియా చర్చ జరగడం ఇదో మినీ రచ్చ అయ్యింది.
సక్సెస్ మీట్ కు రాకుండా మరోసారి క్వశ్చన్ మార్క్ రేపిన నరేంద్ర ఫనిశెట్టి తాజాగా ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో కొత్త సంగతులు చెప్పాడు. అందులో షాక్ ఇచ్చేది ఒకటుంది. 8 వసంతాలని తొలుత సూర్య, దీపికా పదుకునే జంటగా తీయాలనుకున్నానని, కానీ మైత్రి మూవీ మేకర్స్ కొత్త వాళ్ళతో అయితేనే ఇలాంటివి బాగుంటాయని చెప్పడంతో నిర్ణయం మార్చుకున్నట్టుగా చెప్పాడు. వినడానికి బాగానే ఉంది కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే 8 వసంతాలు సూర్య లాంటి స్టార్ హీరోకు అస్సలు సూటవ్వదు. సూర్య సన్నాఫ్ కృష్ణన్ లాగా భవిష్యత్తులో కల్ట్ అని చెప్పుకోవడానికి పనికొస్తుందేమో కానీ థియేటర్ లో జనం ఇలాంటి పాత్రల్లో చూడలేరు.
అలా చూసుకుంటే మైత్రి వాళ్ళు తీసుకున్నది తెలివైన నిర్ణయమని చెప్పాలి. ఎందుకంటే 8 వసంతాలు థియేటర్ కన్నా ఓటిటి, డిజిటల్ డీల్స్ ద్వారా సేఫ్ అయిపోయింది. ఒకవేళ సూర్య లాంటోళ్లను పెట్టుకుంటే బడ్జెట్ విపరీతంగా పెరుగుతుంది. నష్టాలకు రిస్క్ ఉంటుంది. బిజినెస్ పరంగా ఒత్తిడి చవి చూడాల్సి వస్తుంది. ఇవేవి లేకుండా కొత్త వాళ్ళు కాబట్టి సేఫ్ గా బయట పడ్డారు. నిజంగా సూర్య ప్రతిపాదనతో నరేంద్ర ఫనిశెట్టి మాట్లాడుకున్నాడో లేక ఇప్పుడేదో హైప్ కోసం ఇలా అంటున్నాడో చెప్పలేం కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచడమే కాదు ప్రేక్షకులను మెప్పించలేకపోయిన మాట వాస్తవం.
This post was last modified on July 3, 2025 11:50 am
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…