సితారే జమీన్ పర్ బాక్సాఫీస్ వద్ద స్టడీగా దూసుకుపోతోంది. నిన్న పదమూడో రోజు అందులోనూ వర్కింగ్ డే నాడు 40 వేలకు పైగా బుక్ మై షో టికెట్లు అమ్ముడుపోవడం మాటలు కాదు. మాములుగా ఇలాంటి నెంబర్ బ్లాక్ బస్టర్లకే కనిపిస్తుంది. కానీ అమీర్ ఖాన్ సినిమా మరీ జవాన్, పఠాన్ రేంజ్ లో రికార్డులు బద్దలు కొట్టడం లేదు. అయినా సరే నింపాదిగా వసూళ్లు రాబడుతూ లాంగ్ రన్ వైపు ఆశలు పెంచుతోంది. ఇప్పటికే డబుల్ సెంచరీ దాటేసిన సితారే జమీన్ పర్ కు మొన్న శుక్రవారం రిలీజైన కాజోల్ మా మిశ్రమ స్పందన తెచ్చుకోవడం కలిసి వస్తోంది. సీరియస్ హారర్ తో రూపొందిన ఆ చిత్రం సోసోగా ఆడుతోంది.
బాలీవుడ్ విశ్లేషకులు ఈ విజయానికి దారి తీసిన కారణాలు విశ్లేషిస్తున్నారు. ఏ ఓటిటికి అమ్మనని అమీర్ ఖాన్ ముందే తెగేసి చెప్పడం వాటిలో మొదటిది. నెట్ ఫ్లిక్స్ లాంటి బడా సంస్థలు వంద కోట్లకు పైగా ఆఫర్ చేసినా నిర్మొహమాటంగా నో చెప్పడం ప్లస్ అయ్యిందట. పైగా రెండు మూడు నెలల తర్వాత యూట్యూబ్ లో పే పర్ వ్యూ మోడల్ లో స్ట్రీమింగ్ చేసే ఆలోచన ఉన్నట్టు బయటికి రావడం ఇంకో కారణం. అక్కడ కట్టే డబ్బులేవో ఇప్పుడే టికెట్లు కొని థియేటర్లో చూస్తే పోలాని ఆడియన్స్ అనుకోవడం వల్లే అమ్మకాలు బాగున్నాయని అంటున్నారు. పైరసీ వెర్షన్ వచ్చినా దాని ప్రభావం తక్కువగా ఉండటం గమనార్హం.
మరో ముఖ్యమైన విషయం అమీర్ ఖాన్ మీదున్న సింపతీ. ఎంత కష్టపడుతున్నా విజయం దక్కడం లేదనే సానుభూతితో ఉన్న మూవీ లవర్స్ కు డీసెంట్ గా ఉన్న సితారే జమీన్ పర్ కంటెంట్ గొప్పగా కనిపించింది. అందులోనూ ప్రమోషన్ల పరంగా అమీర్ ఖాన్ మాములుగా కష్టపడలేదు. ఒక యూట్యూబ్ ఛానల్ కు నాన్ స్టాప్ గా 5 గంటలకు పైగా సాగే ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం స్టార్ హీరోల హిస్టరీలో ఇదే మొదటిసారి. ఇవన్నీ కూడబలుక్కుని సితారే జమీన్ పర్ కు పట్టం కట్టాయనేది వాటి సారాంశం. ఇంత రెస్పాన్స్ చూశాక అమీర్ ఖాన్ డిజిటల్ రిలీజ్ మరింత ఆలస్యం చేస్తాడని వేరే చెప్పనక్కర్లేదు.
This post was last modified on July 3, 2025 11:07 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…