బాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే మోస్ట్ కాస్ట్లీ మూవీగా రామాయణ పార్ట్ 1 ఉంటుందని ముంబై మీడియా వర్గాలు ఉటంకిస్తున్నాయి. ఇప్పటిదాకా ఏ భారతీయ చిత్రానికి ఖర్చు పెట్టనంత మొత్తం 100 మిలియన్ డాలర్లు దీనికి వెచ్చిస్తున్నారని చెబుతున్నాయి. అంటే మన కరెన్సీలో చూసుకుంటే సుమారుగా 835 కోట్ల పై మాటే. ఇప్పటిదాకా బడ్జెట్ పరంగా నెంబర్ వన్ స్థానంలో ఉన్నది కల్కి 2898 ఏడి. దీనికైనా ఖర్చు 600 కోట్లు. ఆర్ఆర్ఆర్, ఆదిపురుష్ కైన వ్యయం 550 కోట్లు. ఇప్పటిదాకా హిందీ సినిమాల్లో అత్యధిక బడ్జెట్ పెట్టిన రికార్డు బ్రహ్మాస్త్ర పార్ట్ 1 మీద ఉంది. కేవలం 375 కోట్లలో దాన్ని పూర్తి చేశారు.
రామాయణ పార్ట్ 1 నిర్మిస్తున్న నమిత్ మల్హోత్రా గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన స్వంత కంపెనీ ప్రైమ్ ఫోకస్ కి విఎఫ్ఎక్స్ రంగంలో చాలా పేరుంది. ఎనిమిది సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న డిఎన్ఈజి (DNEG) సంస్థకు కూడా నమిత్ సిఈఓగా వ్యవహరిస్తున్నారు. అంటే విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆయనకు ఎంత పట్టు ఉందో అర్థం చేసుకోవచ్చు. రామాయణ పార్ట్ 1ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నమిత్ కు దర్శకుడు నితేశ్ తివారి తోడవ్వడంతో స్కేల్ పెరిగింది. ఇటీవలే మొదటి భాగం షూటింగ్ పూర్తి చేసిన టీమ్ రేపు హైదరాబాద్ లో లాంచ్ చేయబోయే టీజర్ తో ప్రచారానికి తెర తీస్తోంది.
వచ్చే ఏడాది దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 పోస్ట్ ప్రొడక్షన్ కోసమే ఏడాదికి పైగా సమయం కేటాయించనున్నారు. ఎన్ని వేల విఎఫ్ఎక్స్ షాట్స్ ఉంటాయో ఊహించుకోవడం కష్టమని యూనిట్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటిదాకా బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గ్రాండియర్లు ఇవ్వలేదనే లోటుతో ఉన్న బాలీవుడ్ కు ఆ కొరత తీర్చే భారం రామాయణ మీదే ఉంది. రన్బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా నటిస్తున్న ఈ పవిత్ర గాథలో యష్ రావణుడిగా చేయడం అంచనాలు పెంచుతోంది. శాంపిల్ గా రాబోతున్న గ్లిమ్ప్స్ చూశాక ఈ మూవీ కెపాసిటీ గురించి ఒక అంచనాకు రావొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates