ఇటీవలే విడుదలైన కుబేర బ్లాక్ బస్టర్ జోష్ లో ఉన్న నాగార్జున అందులో తాను మెయిన్ హీరో కాకపోయినా విజయంలో కీలక భాగం పంచుకున్నందుకు హ్యాపీగా ఉన్నారు. వచ్చే నెల రాబోతున్న కూలీ మీద ఫ్యాన్స్ అంచనాలు మాములుగా లేవు. రజనీకాంత్ మూవీ అయినప్పటికీ నెగటివ్ షేడ్స్ చేసిన నాగ్ మీదే ఎక్కువ బజ్ వస్తోందని వాళ్ళు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా నాగార్జున వందో సినిమా గురించి గత రెండేళ్లుగా జరుగుతున్న ప్రచారానికి ఫైనల్ చెక్ పెట్టబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ప్రకటించి ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుసింది.
చాలా నెలల క్రితం లీకైన తమిళ దర్శకుడు కార్తీక్ కే ఈ బాధ్యతలు ఇచ్చినట్టు తాజా అప్డేట్. యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో పాటు ఎంటర్ టైన్మెంట్ అంశాలు ఉండేలా పవర్ ఫుల్ సబ్జెక్టు సిద్ధం చేశారట. స్క్రిప్ట్ కోసమే ఏడాదికి పైగా సమయం వెచ్చించినట్టు, దీని కోసం వెయిట్ చేయడం వల్లే నా సామిరంగా తర్వాత సోలో హీరోగా నాగార్జున ఇంకో మూవీ ఒప్పుకోలేదని అన్నపూర్ణ వర్గాలు అంటున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చడం దాదాపు ఖరారైనట్టే. మన్మథుడు, మాస్, కింగ్, కుబేర లాంటి సూపర్ ఆల్బమ్స్ ఇచ్చిన డిఎస్పికే నాగ్ ఓటు వేశారట. అనిరుద్ రవిచందర్ వెంటపడకపోవడం తెలివైన నిర్ణయం.
ఫిల్మోగ్రఫీలో చూసుకుంటే నాగార్జున ఆల్రెడీ వంద సినిమాలు దాటేశారు. కానీ హీరోగా పరిగణనలోకి తీసుకుంటే ఇప్పుడు చేయబోయేది సెంచరీ మూవీ అవుతుంది. కింగ్ 100 అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతానికి దీంతో కానిచ్చి తర్వాత మంచి పేరు ఏదైనా దొరికితే దాన్ని ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారు. 40 సంవత్సరాల సుదీర్ఘ నట ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాగార్జునకు వందో సినిమా మైలురాయిగా నిలిచిపోవాలని చూస్తున్నారు. షూటింగ్ పరంగా హడావిడి లేకుండా వచ్చే ఏడాది రిలీజయ్యేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. క్యాస్టింగ్, టెక్నికల్ టీమ్ తదితర వివరాలు తెలియాల్సి ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates