సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసమో లేదా రీచ్ పెంచుకుని మిలియన్ల ఫాలోయర్లను పెంచుకోవడం కోసమో అతి చేష్టలు చేస్తున్న వాళ్ళ లిస్టు పెరుగుతోంది. సెలబ్రిటీలు సైతం దీనికి మినహాయింపు కావడం లేదు. ఇటీవలే ఖుషి ముఖర్జీ అనే ఆర్టిస్ట్ సగం దేహం కనిపించేలా వేసుకున్న నల్ల దుస్తుల వీడియో ఒకటి తెగ హల్చల్ చేసింది. ఒంట్లో కనిపించకూడని భాగాలు ఎక్స్ పోజ్ అవుతుండగా, వీస్తున్న గాలికి వాటిని సర్దుకోలేక ఇబ్బంది పడుతున్న వైనం శుభ్రంగా కెమెరాలో రికార్డు అయ్యింది. అంతే క్షణాల్లో ఇది ఎక్కడికో వెళ్ళిపోయి కోట్లాది మొబైల్ ఫోన్లలో ఫ్రీ షో ప్లస్ డిస్కషన్ కు దారి తీసింది.
ఇంతకీ ఖుషి ముఖర్జీ ఎవరంటే పలు సినిమాల్లో, సీరియళ్ళలో కనిపించే బాపతు. పెద్దగా పేరు లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన హార్ట్ అటాక్ లో రజనీకాంత్ ఫ్యాన్ స్నేహితురాలిగా కనిపించింది ఈమే. తర్వాత మళ్ళీ సౌత్ లో ఎవరూ ఆఫర్లు ఇవ్వలేదు. హిందీలో ఏదోలా నెట్టుకొస్తోంది. కొన్ని బోల్డ్ వెబ్ సిరీస్ లు చేసింది. మరి గుర్తింపు లేనప్పుడు మీడియా దృష్టిలో పడాలంటే ఏదో ఒక సర్కస్ చేయాలిగా. అయితే ఈ వీడియో చాలా దూరం వెళ్లిపోవడంతో ఖుషి ముఖర్జీ స్పందించింది. కావాలని చేయలేదని, విపరీతమైన గాలి వల్ల ఇబ్బంది కలిగిందే తప్ప కావాలని ఎందుకు చేస్తానని రివర్స్ ప్రశ్న వేసింది.
ఎంత సమర్ధించుకున్నా ఈమె ఎందుకలా చేసిందో ఓపెన్ సీక్రెట్. ఒకవేళ ఇప్పుడీ వీడియో లేకపోయి ఉంటే అసలు ఎవరూ తన ప్రస్తావన తెచ్చేవాళ్ళు కాదు. కోరుకున్న ఐడెంటిటీ వచ్చేసింది కాబట్టి ఎవరైనా దర్శకుడు ఆఫర్లు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఆ మధ్య కుంభమేళాలో ఒక ముక్కు మొహం తెలియని అమ్మాయి చేసిన వైరల్ వీడియో వల్ల ఏకంగా హిందీ సినిమాల్లో నటించే ఛాన్స్ పట్టేసింది. ఖుషి ముఖర్జీ టార్గెట్ కూడా ఇంచుమించు అలాంటిదే . అయినా సినిమాలకు సెన్సార్ బోర్డు ఉంటుంది కానీ రోడ్ల మీద చూపించే విచ్చలవిడితనానికి ఎలాంటి నియంత్రణ ఉండదు. సో వీళ్ళ పని సులువైపోయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates