గత వారం విడుదలై సెకండ్ వీక్ కే వంద కోట్ల గ్రాస్ దాటేసిన కుబేర పది రోజులకు దగ్గర్లోనూ స్ట్రాంగ్ గా రన్ అవుతోంది. కన్నప్ప లాంటి మల్టీస్టారర్ రిలీజ్ ఉన్నా సరే థియేటర్లో జనాలు బాగానే కనిపిస్తున్నారు. ఫైనల్ రన్ ఎక్కడ ఆగుతుందో ఇప్పుడే చెప్పలేం కానీ క్లీన్ హిట్ అనిపించుకోవడానికి సరిపడా వసూళ్లయితే నమోదవుతున్నాయి. ఇంకో రెండు మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ ప్రకటన వచ్చేస్తుంది. ఇక్కడ ఇంత జోరుగా ఉన్న కుబేర తమిళంలో కుచేలుడిలా పోరాడుతున్నాడు. కోలీవుడ్ ట్రేడ్ టాక్ ప్రకారం ఇప్పటిదాకా తమిళనాడు నుంచి వసూలైన మొత్తం కేవలం 20 కోట్ల లోపే నట. ఇది ధనుష్ రేంజ్ కి ఫ్లాప్ నెంబర్.
తమిళ జనాలకు కుబేర కనెక్ట్ కాకపోవడం బయ్యర్లను ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే ధనుష్ ఇంటెన్స్ క్యారెక్టర్లు చేసిన చాలా సినిమాలు కమర్షియల్ గా భారీ వసూళ్లు తెచ్చాయి. అసురన్, కర్ణన్, వడ చెన్నై లాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. కానీ కుబేర వాటి సరసన చేరలేదు. నాగార్జునకు సమాన ప్రాధాన్యం దక్కడం, దేవా పాత్ర డిజైనింగ్ లో హీరోయిజం ఎలిమెంట్స్ లేకపోవడం, అన్నిటి కన్నా ముఖ్యంగా శేఖర్ కమ్ముల దర్శకత్వ శైలి అరవ ఫ్యాన్స్ కు అలవాటు లేకపోవడం లాంటివి కారణాలుగా చెప్పొచ్చు. మెల్లగా పికప్ అవుతుందేమోనన్న అంచనాలు నిజమయ్యే సూచనలు లేవు.
రెండు భాషల్లో తీసినా ఫలితం ఒకేలా రాకపోవడం నిరాశ కలిగించేదే అయినా తెలుగు వెర్షన్ పెర్ఫార్మన్స్ పట్ల ధనుష్, నాగార్జున, ఏషియన్ నిర్మాతలు హ్యాపీగా ఉన్నారు. ఏపీలో పెంచిన టికెట్ రేట్లు మొదటి వారంలో బాగా ఉపయోగపడ్డాయి. కన్నప్ప కాంపిటీషన్ ప్రభావం ఎంత మొత్తంలో ఉంటుందనేది సోమవారం దాకా వేచి చూస్తే క్లారిటీ వస్తుంది. ఏది ఏమైనా తెలుగువాళ్ళ నటించిన లేదా పని చేసిన సినిమాలు తమిళనాడులో బాగా ఆడటం అరుదు. అయితే ధనుష్ ని హీరోగా పెట్టి తీసినా రిజల్ట్ అలాగే రావడం ఊహించనిది. బహుశా ఓటిటిలో వచ్చాకా ఆహా ఓహో అంటూ ప్రశంసలు గుప్పిస్తారేమో చూడాలి.
This post was last modified on June 27, 2025 10:33 pm
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్‌కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…