ఎన్ని ఆఫర్లు వచ్చినా, ఎంత పెద్ద హీరోల పక్కన నటించే ఛాన్స్ దొరికినా కథ నచ్చితే తప్ప ఒప్పుకోని ధోరణి సాయిపల్లవిది. తన పెర్ఫార్మన్స్ కి స్కోప్ లేకపోతే నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంది. చిరంజీవికి చెల్లిగా భోళా శంకర్ లో అడిగితే తిరస్కరించింది ఈ కారణంగానే. తండేల్ ఓకే చెప్పింది కూడా తన క్యారెక్టర్ ప్రాధాన్యం గుర్తించడం వల్లే. ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ సాయిపల్లవికి అతి త్వరలో పెద్ద సవాల్ ఎదురు కానుంది. బాలీవుడ్ డెబ్యూ రన్బీర్ కపూర్ తో చేస్తున్న రామాయణం అయ్యుంటే బాగుండేది కానీ దానికన్నా ముందు రాబోతున్న సినిమా ఒకటి అగ్ని పరీక్ష కానుంది.
అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ సరస సాయిపల్లవి నటించిన భారీ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. ఏక్ దిన్ టైటిల్ ని లాక్ చేయొచ్చని ముంబై మీడియా టాక్. షూటింగ్ చాలా కాలం నుంచి జరుగుతోంది. ఇప్పటికి కొలిక్కి వచ్చిందట. సమస్య ఏంటంటే జునైద్ ఖాన్ మీద జనంలో బాగా నెగటివ్ అభిప్రాయం ఉంది. ఓటిటి తెరంగేట్రం మహారాజతో పాటు ఆ మధ్య వచ్చిన బిగ్ స్క్రీన్ మూవీ లవ్ యాపా దారుణంగా ఫెయిలయ్యింది. సినిమాలు పోతే పోయాయి కానీ కనీసం నటనకు ప్రశంసలు వచ్చి ఉంటే బాగుండేది. అదీ జరగలేదు. తండ్రిలో కనీసం పావొంతు పెర్ఫార్మన్స్ ఇవ్వడం లేదని క్రిటిక్స్ తలంటుతున్నారు.
అలాంటి జునైద్ ఖాన్ సరసన సాయిపల్లవి నటిస్తోంది. సబ్జెక్టు సెలక్షన్ పట్ల అంత కఠినంగా ఉండే ఈ ఫిదా భాగమతిని ఎగ్జైట్ చేసిన విషయాలు ఏక్ దిన్ లో ఏమున్నాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే. నిజానికి ఈ వేసవిలోనే విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు కానీ సాధ్యపడలేదు. ఇప్పుడీ కంటెంట్ ని ఫుల్ చేయాల్సిన బాధ్యత సాయిపల్లవి మీదే ఉంది. జునైద్ ఖాన్ కోసం వచ్చే అభిమానులు పెద్దగా కనిపించడం లేదు. సినిమా ఎక్స్ ట్రాడినరిగా ఉంటే తప్ప ఆడియన్స్ ని కదిలించడం కష్టం. మరి బాలీవుడ్ తొలి అడుగే ఐఎఎస్ ఎగ్జామ్ లా మారిన ఏక్ దిన్ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.
This post was last modified on June 25, 2025 11:46 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…